అన్ని రాష్ట్రాలు ఒకెత్తు.. తెలంగాణ రాష్ట్రం ఇంకో ఎత్తు. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రం ఊరికే ఏర్పడింది కాదు. తెలంగాణ రాష్ట్ర సాదన వెనుక దశాబ్దాల పోరాటం ఉంది. దశాబ్దాల ఉద్యమం ఉంది. అందుకే తెలంగాణను పోరాటాల గడ్డ.. ఉద్యమాల గడ్డ.. అని అంటుంటారు. సరే.. ఇన్నిరోజులు అంటే ఉమ్మడి ఏపీలో తెలంగాణను పట్టించుకోలేదు అనే విమర్శలు వచ్చాయి. కానీ.. ఇప్పుడేమైంది. రాష్ట్రాలు విడిపోయాయిగా. అయినా కూడా తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది అంటూ విమర్శలూ వస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేసీఆర్ పై విమర్శలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఈమధ్య జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కేసీఆర్ పై విమర్శలు రావడం అన్నీ చూస్తుంటే.. తెలంగాణలో త్వరలోనే రాజకీయంగా ఏదో పెనుమార్పు సంభవించబోతోంది అని అంటున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో మరో పార్టీకి స్పేస్ ఉంది. ఆ స్పేస్ ను బీజేపీ సరిగ్గా వాడుకుంటోంది. అందులోనూ ఇటీవల గెలిచిన ఉత్సాహంతో బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసేశారు. దీంతో కేసీఆర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదట.
అయితే.. ఇటీవల సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. కొందరు కేంద్ర మంత్రులను కూడా సీఎం కలిశారు. బీజేపీ.. తెలంగాణలో దూకుడు మీదున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని కలవడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీ దూకుడును కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని.. కేంద్రం నుంచి రావాల్సిన హామీలు, నిధుల విషయంలోనూ కేంద్రం ఇబ్బందులు పెడుతోందని.. ఈ నేపథ్యంలో కేంద్రానికి జై కొట్టడమే బెస్ట్ అని కేసీఆర్ భావిస్తున్నరాంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
ఎందుకొచ్చిన గొడవ.. బీజేపీకి జై అంటే సరిపాయె.. అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెట్టినా.. బీజేపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో బీజేపీకి జై కొట్టి.. తెలంగాణలో బీజేపీ పాగా వేయకుండా చూడాలనేది కేసీఆర్ ప్లాన్ అట. అందులోనూ టీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలు బీజేపీలోకి జంప్ కొట్టకుండా ఉండాలన్నా… ప్రస్తుతానికి బీజేపీతో మంచిగా ఉండటమే బెటర్ అని అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే.. కేసీఆర్.. ఎన్డీఏలో చేరుతున్నారని.. ఎన్డీఏ భాగస్వామ్యంగా టీఆర్ఎస్ ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. వాటిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.