రాజకీయాల్లో అలకలు, కోపాలు కొంతవరకే అని నిరూపించాడు తెలంగాణ సీఎం కేసీఆర్.. జలవివాదం పై తెలంగాణ, ఆంధ్ర సీఎంల విషయంలో కొన్ని పత్రికలు అయితే టీఆర్ఎస్ పని పడుతున్న వైఎస్ జగన్.. కేసీయార్‌కు షాకిచ్చిన ఏపీ సీయం అంటూ ఏవేవో హెడ్దింగులు పెట్టి వార్తలను ప్రచురించాయి.. ఇది చదివిన పాఠకులు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శత్రువుల్లా మారిపోయారు అని భావించారట. రాజకీయాల్లో స్నేహాలు, బందుత్వాలు ఉండవని గుసగుసలు కూడా పెట్టుకున్నారట కొందరు.. కానీ ఇదంతా ఒకవైపే రెండోవైపు చూస్తే వైఎస్ జగన్ చేస్తున్న న్యాయ పోరాటానికి తెలంగాణ సీఎం మద్దతు పలికారట.. ఆ వివరాలేంటో చూస్తే..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుని, ఏకంగా జడ్జిలపైనే న్యాయ పోరాటానికి సిద్ధమైందన్న విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం శనివారం రాత్రి అమరావతి భూ కుంభకోణం, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల తీర్పులకు సంబంధించిన విషయంలో ఒక కీలక ప్రెస్‌మీట్ విజయవాడలో ఏర్పాటు చేశారు.. ఇక ఏదైనా కొత్త న్యూస్ దొరికితే చెవులు చిల్లులుపడేదాక బ్రేకింగ్ న్యూస్ అంటూ హంగామా చేసే వివిధ చానళ్ళు తీరా ప్రెస్‌మీట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రత్యక్ష ప్రసారం చేయకుండా నిమ్మకుండి పోయాయట.. ఇక టీడీపీ అనుకూల చానళ్లు ఎటూ ఆ ప్రెస్‌మీట్‌ను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సర్కార్‌తో సఖ్యతగా మెలుగుతాయని పేరున్న చానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి భయపడ్డాయట. ఇక కొన్ని పత్రికలు మాత్రం ఈ విషయాన్ని నామమాత్రంగా ప్రచురించాయట.. అయితే ఇక్కడే ఒక అద్భుతం జరిగిందంటున్నారు..
వైఎస్ జగన్ చేస్తున్న పోరాటానికి అనూహ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు తెలుపుతూ, టీఆర్ఎస్ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో అజయ్‌కల్లం ప్రెస్‌మీట్‌కు అగ్రస్థానం కల్పించాడట.. ఇంకా చెప్పాలంటే సాక్షి కంటే మిన్నగా నమస్తే తెలంగాణ పత్రికలో ఈ వార్తా కథనాన్ని హైలెట్ చేశారట.. అయితే ఇక్కడ కామన్ మ్యాన్‌కు ఒక చిన్న అనుమానం వచ్చిందంట.. తెలంగాణాలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనుల విషయాల్లో కోర్టుల జోక్యం ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఎన్నో సార్లు మొట్టకాయలు కూడా వేసింది.. ఈ క్రమంలో జగన్ పోరాటం ఫలిస్తే.. ఇదే ప్రణాళికను తెలంగాణాలో కేసీయార్ కూడా అప్లై చేసినా చేస్తారు.. అని అనుకుంటున్నాడట.. మరి ఇంత తెలివి ఉన్న కామన్ మ్యాన్ అవినీతి రాజకీయాలను ఎందుకు అందలం ఎక్కిస్తున్నాడో ఆలోచించుకోవాలి..