ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆ ఎంపీ డెడ్ లైన్ పెట్టారు. సీఎం జగన్.. ఆ విషయంపై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందనంటూ సవాల్ విసిరారు. ఇంతకీ.. ఆ ఎంపీ ఎవరు? తెలంగాణ ఎంపీతో ఏపీ సీఎంకు ఏంటి గొడవ? ఈ డెడ్ లైన్ సంగతేంది? అంటారా? పదండి.. వివరంగా తెలుసుకుందాం..
తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ.. అదేనండి.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు కదా.. ఆయన గురించే మనం మాట్లాడుకునేది ఇఫ్పుడు. ఆయన ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరారు.
మైహోం సంస్థ ఏపీలో అక్రమాలకు పాల్పడుతోందని.. దానికి సంబంధించి మైహోం సంస్థపై చర్యలు తీసుకోవాలని అరవింద్… సీఎం జగన్ ను కోరారు.
గుంటూరులో మైహోం సంస్థ వెయ్యి ఎకరాల స్థలాన్ని ఆక్రమించిందట. అది అక్రమమని.. మైహోం సంస్థ చేసిన అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకొని.. ప్రజల సొమ్మును వెంటనే రికవరీ చేయాలని.. అరవింద్ డిమాండ్ చేశారు. తెలంగాణలో మైహోం సంస్థకు ఎలాగూ తెలంగాణ ప్రభుత్వం అమ్ముడుపోయింది. అక్కడి ప్రభుత్వం ఏ చేయలేదు ఆ సంస్థను అంటూ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ కు మంచి భవిష్యత్తు ఉంది. అందుకే అక్టోబర్ 15 లోపల మైహోం అక్రమాలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించి.. తన చిత్తుశుద్ధిని సీఎం జగన్ నిరూపించుకోవాలంటూ అరవింద్.. జగన్ కు డెడ్ లైన్ విధించారు.
మరి.. అరవింద్ వ్యాఖ్యలకు సీఎం జగన్ రెస్పాండ్ అవుతారా? లేదా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.