కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను మెచ్చుకోవడమంటే మామూలు విషయం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెచ్చుకునేంతలా వాళ్లు ఏం చేశారు అంటారా? తెలంగాణలోని అన్ని పంచాయతీలను ఆన్ లైన్ ఆడిట్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నిజానికి అన్ని రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రంలోని పంచాయతీలను ఆన్ లైన్ ఆడిట్ చేస్తున్నప్పటికీ… తెలంగాణ మాత్రం దేశానికే మార్గదర్శిగా నిలిచిందంటూ కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ లేఖ రాసింది.
ఎందుకంటే… ఈ ఆర్థిక సంవత్సరంలోనే 50 శాతం పంచాయతీల్లో ఆన్ లైన్ ఆడిట్ ను అమలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. వచ్చే సంవత్సరంలో నూటికి నూరు శాతం పంచాయతీల్లో ఆన్ లైన్ ఆడిట్ అమలు చేయడం లక్ష్యాన్ని చేరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.
రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ఆన్ లైన్ ఆడిట్ చేయడంతో పాటుగా… నివేదికలన్నింటినీ ఆన్ లైన్ లో పొందుపరచడం… ఆ నివేదికలను పంచాయతీలకు పంపించడం లాంటి అన్ని విషయాల్లో తెలంగాణ అవలంబిస్తున్న విధానాలు చాలా బాగున్నాయిని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశంసిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు.
అందుకే తెలంగాణ అవలంబిస్తున్న విధానాలనే ఇతర రాష్ట్రాలకు కూడా ఆన్ లైన్ ఆడిట్ లో భాగంగా ఉపయోగించాలని కేంద్రం ఇతర రాష్ట్రాలకు సూచిస్తోంది.