Tejaswi Madivada: పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని కంటా.. బోల్డ్ కామెంట్స్ చేసిన తేజస్విని!

Tejaswi Madivada: తెలుగు ప్రేక్షకులకు నటి యాంకర్ తేజస్విని మదివాడ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తేజస్విని. బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటూనే యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కూడా నటిస్తోంది తేజస్విని. కాగా మహేష్ బాబు వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే నుంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ద్వారా సక్సెస్ అందుకోవడంతో ఈమెకు హార్ట్ ఎటాక్, ఐస్ క్రీమ్, మనం, ప్రేమికులు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈమె మాట్లాడిన బోల్డ్ మాటలు బోల్డ్ ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియో క్లిప్ లు ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. చాలామంది తేజస్విని పై మండిపడుతూ ఇలాంటి చెత్త షోలు ఎందుకు చేస్తారు ఫ్యామిలీతో చూడాలంటే భయంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే చాలా సందర్భాలలో లవ్ రిలేషన్ వాటి గురించి తేజస్విని స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..

నా జీవితంలో పెళ్లి అనే ప్రస్తావన లేదు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వయసు అయిపోతే బాగుంటుంది. ఇలా పెళ్లి చేసుకోను అని చెప్పిన ఈమె పిల్లలు మాత్రం కావాలంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. పెళ్లి కాకుండా పిల్లలు ఎలా టెస్టు బేబీ ద్వారా ప్లాన్ చేస్తావా? అంటే అదేం లేదు సుస్మిత సేన్ పిల్లల్ని కని ఇప్పుడు పెళ్లి చేసుకోలేదా అంటూ ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. తాను పెళ్లి మాత్రమే చేసుకోనని లివింగ్ రిలేషన్ లో ఉంటానని ఈ సందర్భంగా తేజస్వి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్స్ తన లైఫ్ గురించి తనకు ఫుల్ క్లారిటీ ఉంది అంటూ కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం ఇలా రిలేషన్ లో ఉండి పిల్లల్ని కనడం కంటే కూడా అనాధలను దత్తత తీసుకొని పెంచితే ఒకరికి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది ఆమెపై మండి పడుతున్నారు.