Crime News: సాధారణంగా ప్రభుత్వ కొలువుతీరిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగ నిమిత్తం బదిలీలు చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉద్యోగులు తమ సొంత ప్రాంతం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. అయితే ఉద్యోగ నిమిత్తం తనని బదిలీ చేశారన్న కారణంతో ఎంతో మనస్తాపం చెందిన ఒక ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే…
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి అనే మహిళ అ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఉపాధ్యాయురాలు సరస్వతిని ఉద్యోగ బదిలీ నిమిత్తం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాకు బదిలీ చేశారు. ఇలా ఆమెను బదిలీ చేయడంతో ఎంతో మనస్తాపం చెందింది. ఆ ప్రాంతానికి ఉద్యోగ నిమిత్తం వెళ్ళలేక బదిలీ మార్చుకోలేక ఎంతో మనస్తాపం చెందింది.
ఈ క్రమంలోనే బదిలీ చేశారన్న కారణంతో ఎంతో మనస్తాపం చెందిన సరస్వతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమె ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుందా? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది వరకు సరస్వతి పొరుగూరు రహత్‌నగర్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేసేది.