ఆ పార్టీలో సగం మంది వైసీపీ వాళ్ళుంటే ఇంకో సగం మంది టీడీపీ వాళ్ళున్నారు

 ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చిత్రమమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి.  తాము తెలుగుదేశం పార్టీకి ఎంత దూరమో వైసీపీకి కూడ అంతే దూరం అంటుంటారు ఆ పార్టీ కొట్టుట అధ్యక్షులు సోము వీర్రాజుగారు.  కానీ వ్యవహారం చూస్తే బీజేపీ వైసీపీకి ఎంత దగ్గరో టీడీపీకి అంతే దగ్గర అన్నట్టుగా ఉంది వాతావరణం.  సోము వీర్రాజుగారు అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న రోజు నుండి పార్టీలో కొత్త వేగం పుట్టుకొచ్చిందన్న  వాస్తవం.  కానీ ఆ వేగం దశ, దిశ లేకుండా వెళ్తోంది.  కాసేపు చంద్రబాబు మీదకి కత్తులు దూస్తే ఇంకాసేపు వైసీపీ మీదకి కత్తులు దూస్తుంటారు.  ఈ కత్తులు దూయడం ఏకపక్షంగా జరిగితే బాగుంటుంది కానీ అలా జరగట్లేదు.  

TDP, YSRCP coverts in BJP 

వైసీపీ మీద విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు టీడీపీ మీద సానుభూతి చూపుతారు.  టీడీపీ మీద యుద్ధం చేయాల్సి వస్తే వైసీపీని వెనకేసుకొస్తారు.  ఇలా ద్వంద వైఖరిలో ఉంది ఆ పార్టీ నాయకుల పనితీరు.  రెండు ప్రధాన పార్టీలకు మధ్యలో  కూర్చున్న బీజేపీ ఒక పార్టీకి దూరం జరిగితే ఇంకో పార్టీకి దగ్గరవడం యాధృచ్ఛికంగా జరిగిపోతోంది.  ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీలో ఉన్న నేతల్లో సగం మంది వైసీపీకి అనుకూలమైతే ఇంకో సగం మంది టీడీపీకి అనుకూలంగా  ఉన్నారు.  వైసీపీ వర్గం టీడీపీ మీద టీడీపీ వర్గం వైసీపీ మీద మాటలు విసురుతాయి.  అలాగే పొగడ్తలు కూడ. 

TDP, YSRCP coverts in BJP 

పార్టీలోని ఈ చిత్రమైన లక్షణం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.  జనం కూడ ఇదేంటి బీజేపీకి సొంత వ్యక్తిత్వం అంటూ ఏం లేదా, ఎంతఎపూ టీడీపీ, వైసీపీలను  తిట్టడమో, కనిపించకుండా పొగడటమో తప్ప వేరే పని చేయరా  అంటున్నారు.  ఈ అనుమానం త్వరలోనే బీజేపీలో ఉన్న టీడీపీ, వైసీపీ నాయకుల పట్టించేస్తుంది.  అప్పుడు ఈ తతంగం బీజేపీ అధిష్టానానికి తెలిసి జరుగుతోందా తెలీకుండా జరుగుతోందా అనేది కూడ బట్టబయలవుతుంది.  ఇప్పటికే రాష్ట్రం మీద కేంద్ర నాయకత్వం దృష్టి కోణం గోడ మీద పిల్లి అనే తరహాలో ఉందని మండిపడుతున్న జనం రాష్ట్ర శాఖ మీద కూడ అసంతృప్తిని ప్రదర్శించే ప్రమాదం ఉంది.