2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ యొక్క పరిస్థితి ఎలా ఉందొ అందరికి తెలుసు. దాదాపు పతనావస్థకు చేరువలో ఉంది. అలాంటి పార్టీని బతికించడానికి చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ యొక్క నాయకత్వాన్ని మార్చడానికి బాబు సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే పార్టీ పార్లమెంటరీ పదవులు ఇచ్చారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనూ కొత్త వారిని నియమించారు. పార్టీ పొలిట్ బ్యూరోలోనూ కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళ వల్లనే పార్టీ మరింత మరుగున పడుతుందని టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త నాయకులు పార్టీని పట్టించుకోవడం లేదా!!
చంద్రబాబు నాయుడు నియమించిన ఈ కొత్త నాయకులు అసలు పార్టీని పట్టించుకోవడం లేదని, పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా పాత నాయకులే వస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. కొత్త నాయకులను నియమిస్తే పార్టీలో నూతన ఉత్సహం వస్తుందని చంద్రబాబు నాయుడు భావిస్తే ఈ కొత్త నాయకులు మాత్రం అసలు పార్టీనే పట్టించుకోవడం లేదు. అయితే ఈ కొత్తగా నియమింపబడ్డ నాయకులు వైసీపీ చేస్తున్న కక్ష్యపూరిత రాజకీయాలకు భయపడి బయటకు రావడం లేదని టీడీపీ నాయకులు చెప్తున్నారు.
మరిప్పుడు బాబు ఏమి చేయనున్నారు??
ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్ళు కొనసాగితే టీడీపీ పూర్తిగా పతనమవ్వడం ఖాయం. కాబట్టి చంద్రబాబు నాయుడు అప్పుడే మేల్కొని కొత్తగా నియమింపబడ్డ నాయకులతో, సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు తగిన సూచనలు ఇవ్వనున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.