2019 ఎన్నికల్లో టీడీపీ ఎంతటి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుందో అందరికి తెలిసిందే. అప్పుడు వచ్చిన ఓటమిని. ఇప్పటికి టీడీపీ నాయకులు అంగీకరించలేకపోతున్నారు. పార్టీ దాదాపు పతనావస్థకు చేరుకున్న దశలో పార్టీని మళ్ళీ గాడిలో పెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో కృష్టిలో చేస్తున్నారు. అలాగే ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడిని నియమించి పార్టీలో నూతన ఉత్సహం నింపారు. అయితే ఇప్పుడు అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని టీపీడీని ముప్పు తెచ్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
మళ్ళీ అదే తప్పు చేస్తున్నారుగా!!
2019 ఎన్నికల్లో టీడీపీకి బలంగా ఎదురుదెబ్బ తగిలిన ప్రాంతం ఏదన్నా ఉందంటే అది ఉత్తరాంధ్ర ప్రాంతమే. ఆ ప్రాంతం ప్రజలు ఒక్కసారిగా బాబుకు షాక్ ఇచ్చారు. అక్కడి ప్రజలు బాబుకు అండగా ఉంది కనీసం 50 సీట్స్ అయిన వచ్చేవి. అయితే ఈ ప్రాంతంలో పార్టీని బలపరిచే టాస్క్ ను బాబు అచ్చెన్నకు అప్పగించారు. అచ్చెన్న కూడా ఆ టాస్క్ ను బాగా నిర్వహిస్తున్నారు. భయం లేకుండా ఆ ప్రాంతం నుండి వైసీపీని, సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ అచ్చెన్న రాజధాని విషయంలో పెద్ద తప్పు చేస్తున్నారు. మూడు రాజధానులు ఉత్తరాంధ్ర ప్రజలు కోరలేదని అనడం మాత్రం ఇబ్బంది అవుతుందా అన్నదే పార్టీలో చర్చగా ఉందిట. ఎందుకంటే మూడు రాజధానులను జగన్ ప్రకటించినప్పుడు అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చెయ్యడం వేరు, మూడు రాజధానుల పట్ల ఉత్తరాంధ్ర ప్రజలే ఆనందంగా లేరని చెప్పడం మాత్రం పార్టీకి నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
విశాఖలో కూడా ఓడిపోతారా!!
టీడీపీ నాయకులు గతంలో విశాఖలో గెలవడానికి అక్కడ వైసీపీకి బలమైన నాయకులు లేకపోవడమే తప్పు టీడీపీ బలమైనది కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు ఇలాగే టీడీపీ నాయకులు మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా వాదిస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో విశాఖలో కూడా టీడీపీకి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.