రాజకీయాల్లో మనం ఎదగకపోయినా పర్లేదు కానీ మన పక్కన ఉన్నవాళ్లు మాత్రం ఎదగకూడదనే సూత్రం రాజకీయ నాయకులు వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు టెక్కలిలో మాత్రం వైసీపీ నాయకులు ఏకంగా టీడీపీ ప్రెసిడెంట్ యొక్క బలాన్ని రోజురోజుకు పెంచడానికి బలంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు కారణం వైసీపీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత గొడవలు. ఈ గొడవలే టెక్కలిలో అచ్చెన్న శ్రీరామ రక్షగా మారాయి.
టెక్కలిలో వైసీపీ గొడవలు
ఏపీలో కచ్చితంగా గెలిచే సీటు ఏదీ అని టీడీపీ తమ్ముళ్ళను ప్రశ్నిస్తే తడుముకోకుండా ఇపుడు చెప్పే పేరు టెక్కలి అనే. చంద్రబాబు కుప్పం సీటుకైనా డౌట్ ఉందేమో కానీ అచ్చెన్నాయుడుకు మాత్రం ఏ బెదురూ బెంగా అసలు లేవుట. దానికి కారణం టెక్కలి వైసీపీలో వర్గపోరు. అక్కడ మూడు ముక్కలాట యమ రంజుగా సాగుతోంది. టెక్కలి వైసీపీ ఇంచార్జిగా దువ్వాడ శ్రీనుకు బాధ్యతలు అప్పగించారు. అలాగే టెక్కలిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన పేడాడ తిలక్ ని కాళింగ కార్పొరేషన్ చైర్మన్ ని చేశారు. ఇక అదే ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కూడా జగన్ గట్టి హామీని ఇచ్చారు. ఇక టెక్కలి వైసీపీలో అంతా సెట్ అయిందని ఎవరైనా భావిస్తే అదే తప్పు. ఈ వర్గ పోరు మరింత రాజుకుంటోంది కానీ ఆగడంలేదు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచినా!!
2019 ఎన్నికలలో వైసీపీ రాష్ట్రంతన హవాను చూపించింది కానీ టెక్కలిలోకి మాత్రం అచ్చెన్నను టచ్ చేసే దమ్మున్న నాయకుడు మాత్రం వైసీపీ దొరకడం లేదు. అచ్చెన్నాయుడు మీద 2014 ఎన్నికల్లో దువ్వాడ శ్రీను వైసీపీ తరఫున టెక్కలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 లో తిలక్ పోటీ చేసి ఓడారు. ఇపుడు 2024లో దువ్వాడ శ్రీనుకు టికెట్ ఖాయమని అంటున్నారు. అయితే ఇక్కడ వైసీపీ బలం ఉన్నా కూడా వైసీపీలో ఉన్న అంతర్గత గొడవల వల్ల వైసీపీకి ఓటమి వస్తుంది. మరి వచ్చే ఎన్నికల్లో అయినా వైసీపీ గెలుస్తుందో లేదో వేచి చూడాలి.