AP: వైఎస్ జగన్ మూలాలపై గురిపెట్టిన బాబు … జగన్ రాజకీయానికి చెక్ పెట్టనున్నారా?

AP : ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కూటమి పార్టీలో అధికారంలో ఉన్నాయి. పొత్తులో భాగంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేసి 164 స్థానాలలో విజయం సాధించగా వైఎస్ఆర్సిపీ పార్టీని కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. 2019 ఎన్నికలలో 151 స్థానాలలో సింగిల్గా పోటీ చేసే విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డిని గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు.

ఇలా వైఎస్ఆర్సిపి పార్టీని ఆంధ్రలో పూర్తిస్థాయిలో బలహీనపరిచారని చెప్పాలి అయితే ఈ పార్టీకి 11 స్థానాలు మాత్రమే రావడంతో ఎంతోమంది కీలక నేతలు వైసిపి నుంచి బయటకు వస్తూ కూటమిలో చేరుతున్నారు. ఇలా వైసిపిని టార్గెట్ చేస్తూ కీలక నేతలందరూ పార్టీ నుంచి బయటకు రప్పించడమే కాకుండా వైసిపిని పూర్తిగా బలహీన పరుస్తూ కూటమినేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రాజకీయాలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తుంది ఇందులో భాగంగానే జగన్ మూలాలను టచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో గత ఎన్నికలలో ఊహించని విధంగా టిడిపి విజయకేతనం ఎగురవేసింది. సొంత జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తప్పలేదు.

ఈ క్రమంలోనే కడపలో కూడా పసుపు జెండా పాగా వేయటం కోసం చంద్రబాబు నాయుడు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగబోయే మహానాడు సభను కడప జిల్లా జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో నిర్వహించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల వేదికగా తమ సత్తా చాటాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో అనూహ్య ఫలితాలు సాధించిన టీడీపీ.. తమ పట్టు కొనసాగించాలని భావిస్తోంది.

పులివెందులో మహానాడు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి.. సక్సెస్ చేయటం ద్వారా కేడర్ లో జోష్ మరింత పెరుగుతుందనే అంచనాతో టీడీపీ నాయకత్వం ఉంది. ఇదే సమయంలో జగన్ ను రాజకీయంగా ఫిక్స్ చేయవచ్చని భావిస్తున్నారు. ఇలా చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం జగన్ రాజకీయాలపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందనేది తెలియాల్సి ఉంది.