తూర్పులో టీడీపీ సరికొత్త వ్యూహం..లబోదిబోమంటున్న సీనియర్స్

chandrababu naidu Telugu Rajyam

  తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికలో ఘోర పరాజయం ఎదురుకావడంతో కొన్ని సత్యాలు బోధపడ్డాయి. వాటిలో ముఖ్యమైంది పార్టీలో యువతరానికి పెద్ద పీట వేయాలని, గతంలోనే ఈ విషయంలో అనేక చర్చలు జరిగిన కానీ, బాబు తనతోటి సీనియర్స్ ని పక్కన పెట్టలేకపోయాడు. అయితే దాని ఫలితాలు కూడా అనుభవించాడు అనుకోండి, ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల వారీగా అధ్యక్షులను నియమించాడు చంద్ర బాబు. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పార్లమెంటరీ స్థానాలు వున్నాయి. ఇక్కడ కుల సమీకరణాలు లెక్కకట్టి మరి ఆయా స్థానాల్లో అధ్యక్షులను నియమించారు.

chandrababu naidu Telugu Rajyam

 

  కాకినాడకు కాపుల కోటాలో జ్యోతుల నవీన్ కుమార్, రాజమండ్రికి ఎస్సీ వర్గానికి చెందిన మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ ను, అమలాపురానికి బీసీ వర్గానికి చెందిన అనంతకుమారిని నియమించాడు. దీనితో మూడు సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్లు, అలాగే మహిళల కోటా కూడా పూర్తిచేసినట్లు అయ్యింది. ఈ నియామకాలు గమనిస్తే యువతరానికి పెద్ద పీట వేసినట్లు అర్ధం చేసుకోవచ్చు. అయితే జిల్లాలోని సీనియర్ నేతల్లో దీనిపై కొంచం అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ ఆవిర్భావం నుండి చినరాజప్ప ఆ జిల్లాకు అధ్యక్షుడిగా వుంటూ వచ్చాడు, జిల్లాలో ఎలాంటి విభేదాలు వచ్చిన ఆయనే వాటిని చక్కబెట్టేవాడు. ఆయనతో పాటుగా టీడీపీ నెంబర్ 2 లీడర్ యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రు లాంటి నేతలు జిల్లాలో పార్టీని ముందుండి నడిపించారు. కానీ ఇప్పుడు యువతకు పగ్గాలు ఇవ్వటంతో సీనియర్ల పరిస్థితి ఏమిటి అనేది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

 కొత్త అధ్యక్షులు పార్టీకి పూర్వ వైభవం తీసుకోని రావాలంటే ఖచ్చితంగా సీనియర్ నేతలను కలుపుకొని ముందుకి పోవాలి. ఎట్టి పరిస్థితులో వాళ్ళ మద్దతు లేకుండా జిల్లాలో పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేయటం కుదరదు. మరి జూనియర్స్ కి ఆయా సీనియర్ నేతలు ఎంతవరకు సహకరించి, కలిసికట్టుగా పనిచేస్తూ టీడీపీకి పాత వైభవం తీసుకోని వస్తారో చూడాలి. కేవలం తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అన్ని చోట్ల యువతకు ప్రాధాన్యత ఇవ్వటంతో సీనియర్స్ కి ప్రాధాన్యత తగ్గిన మాట వాస్తవమే, పార్టీ భవిష్యత్తు కోసం ఇలాంటి నిర్ణయాలు తప్పవు, మరి ఈ నిర్ణయం పార్టీకి ఎంత వరకు మేలు చేస్తుందో చూడాలి.