అధికార పార్టీ మీద బురద జల్లేందుకు ప్రతిపక్షాలు దర్నా చేస్తాయి. అది ఎక్కడైనా చూసేదే. ఏదైనా ఒక పార్టీకి చెందిన నాయకులు దర్నా చేస్తుంటారు.. అదీ చూశాం. కానీ.. అధికారపక్షం, ప్రతిపక్షానికి చెందిన ఎంపీలు కలిసి దర్నా చేయడం ఎక్కడైనా చూశారా? బహుశా మొదటిసారి చూసుంటారు. అదే ఢిల్లీలో.
వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అంతర్వేదిలో ఆలయ రథం దగ్ధం ఘటనకు నిరసనగా ఆయన ఈ దీక్షను చేపట్టారు. గాంధేయ పద్ధతిలో 8 గంటల పాటు ఆయన ఈ దీక్ష చేపట్టారు.
శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఆయన ఈ దీక్షను కొనసాగించగా.. ఆ దీక్షాశిబిరంలో ఓ విచిత్రం చోటు చేసుకున్నది. ఆ దీక్షకు ఏకంగా టీడీపీ ఎంపీ మద్దతు పలికారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్.. ఆ దీక్షకు మద్దతు పలకడంతో అందరూ షాక్ కు గురయ్యారు.
నిజానికి.. ఈ దీక్ష.. రాజకీయాలకు అతీతంగా జరిగింది. కులాలు, మతాలకు అతీతంగా జరిగింది. అందుకే.. ఈ దీక్షకు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ పార్టీ కోరింది. ఈనేపథ్యంలో ఢిల్లీలో తన నివాసంలోనే రఘురామకృష్ణంరాజు దీక్షకు దిగగా.. టీడీపీ ఎంపీ కూడా ఆయనకు మద్దతు పలికారు.
ఈసందర్భంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ఇలా వరుసగా ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న హిందూ ద్రోహులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.
ఇక.. టీడీపీ ఎంపీ కనకమేడల.. రఘురామకృష్ణంరాజు పక్కన కూర్చొని ఆయనకు మద్దతు పలికారు. ఈదీక్షకు మరికొందరు ప్రముఖులు కూడా మద్దతు పలికారు.