ఇకనైనా రఘురామ ఓవరాక్షన్ ఆగుతుందా.?

raghurama

ఢిల్లీ పెద్దల అండ తనకు వుందనీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తనకున్న పరిచయాలతో తాను ఎలా విర్రవీగినా చెల్లుతుందనీ ఇప్పటిదాకా ధీమాగా వున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. కానీ, సీన్ సితార్ అయిపోయింది. సొంత నియోజకవర్గానికి వెళ్ళలేని దుస్థితి. రాకరాక వచ్చిన ఓ అద్భుతమైన అవకాశం వృధా అయిపోయింది.

ప్రధాని నరేంద్ర మోడీకి తన నియోజకవర్గంలో స్వాగతం పలికి, ఆయనకు అతిథి మర్యాదలు చేసే అవకాశాన్ని రఘురామకృష్ణరాజు చేజేతులా నాశనం చేసుకున్నారు. ఎందుకిలా.? రైలులో బయల్దేరి, అంతలోనే కిందికి దిగిపోవాల్సిన దుస్థితి రఘురామకు ఎందుకు వచ్చింది.?

ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ పేరు వుండాలి, ప్రధాని పర్యటన నేపథ్యంలో. కానీ, లేదాయె. వేదిక మీద కూడా రఘురామ వుండి వుండాలి. కానీ, చోటు దొరకలేదు. అసలంటూ సొంత నియోజకవర్గానికే రఘురామ వెళ్ళలేదాయె. ఇది క్లియర్.. రఘురామకి కేంద్రం దగ్గర పరపతి లేదు. బీజేపీ ఆయన్ని ఎంటర్టైన్ చేయడంలేదు.

వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు పోటీ చేయడం అనేది జరిగే పని కాదు. ఆయన్ని ఏ పార్టీ కూడా అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. మరెలా.? మిగిలిన రెండేళ్ళు (పూర్తిగా రెండేళ్ళు కాదు లెండి..) ఆయన ఎంపీగా కొనసాగుతారా.? లేదా.? అన్నదానిపైనా అనుమానాలున్నాయి.

కేవలం టీడీపీ అనుకూల మీడియాతో కలిసి, రాజకీయ రచ్చ చేయడానికే రఘురామ పరిమితమవుతున్న దరిమిలా, బీజేపీ కూడా ఆయన్ని దూరం పెట్టినట్లు తెలుస్తోంది.