Byreddy shabari: పుష్ప 2 పై టీడీపీ ఎంపీ సంచలన పోస్ట్… నంద్యాలలో ఈవెంట్ పెట్టమంటూ సెటైర్స్!

Byreddy shabari: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాని టార్గెట్ చేశారని తెలుస్తోంది. అయితే తాజాగా నంద్యాల టిడిపి ఎంపీ బైరెడ్డి శబరి అల్లు అర్జున్ పై సెటైరికల్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే వెంటనే ఈమె ఆ పోస్టును డిలీట్ చేయటం విశేషం.

ఈ విధంగా ఎంపి ఆ పోస్టును డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అధికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేస్తూ.. అల్లు అర్జున్ గారు మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడ మా ప్రజలకు ఇప్పటికీ మర్చిపోలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్ మాదిరిగా మీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఇక్కడే చేస్తారని మేము ఆశించాము. మీ నంద్యాల సెంటిమెంట్ మాకు చాలా మంచిగా వర్క్ అవుట్ అయింది. మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవాలి అని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ఈమె పోస్ట్ చేశారు.

ఈ విధంగా ఈమె చేసిన ఈ పోస్ట్ వెంటనే డిలీట్ చేశారు అయితే అప్పటికే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈమె నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటించడం వల్లే వైకాపాకు నాయకుడు శిల్పా రవి ఓడిపోయారని ఇప్పుడు కూడా ఇక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే సినిమా పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈమె సెటైర్స్ వేస్తూ ట్వీట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్టుపై ఎంతోమంది వైకాపా అల్లు అర్జున్ అభిమానులు విభిన్న రకాలుగా స్పందిస్తూ పోస్టులు చేస్తున్నారు. అయితే వీరందరికీ సరైన సమాధానం చెప్పాలి అంటే పుష్ప సినిమా మంచి సక్సెస్ అయితేనే వీరందరికీ బన్నీ గట్టి సమాధానం ఇచ్చినట్టు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.