టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. వైసీపీ నాయకులపై, వైసీపీ ప్రభుత్వంపై ఎంతలా భగ్గుమంటారో తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ మీట్లలో.. వేరే చోట ఎక్కడ చూసినా.. ఆయన టార్గెట్ వైసీపీనే. ఎవ్వరినీ వదలరు ఆయన.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కృష్ణదాస్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మానపై బుద్దా వెంకన్న మండిపడ్డారు.
ధర్మాన శ్రీకాకుళం 420 అంటూ ఎద్దేవా చేశారు. ఒకరిని వేలెత్తి చూపడం కాదు.. మిగిలిన నాలుగు వేళ్లు మన వైపే చూస్తున్నాయి.. అనే విషయాన్నిన మరిచిపోవద్దు.. అంటూ ధర్మానకు హితభోద చేశారు.
చంద్రబాబును ఇప్పటి వరకు ఎవరూ అనని మాటలను ధర్మాన అన్నారంటూ బుద్దా వెంకన్న మండిపడ్డారు. తన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ధర్మాన మతిలేని మాటలు మాట్లాడుతున్నారని.. చంద్రబాబును తిడితే సాక్షి టీవీలో చూపిస్తారని మంత్రులు ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.
ప్రస్తుతం ఏపీలో ఎలా పరిస్థితి ఎలా ఉందంటే.. పురోహితుల నోటి వెంట నీతులు, పనికిమాలిన మంత్రుల నోట్లో నుంచి బూతులు చూస్తున్నామని.. ఇది రాష్ట్రానికి పట్టిన దౌర్బాగ్యమని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.