లాక్ డౌన్ కారణంగా టీడీపీ అధినేత హైదరాబాద్ లో ఇల్లు దాటి బయటకు రావడం లేదు. సభలు..సమావేశాలు అన్ని వీడియో కాన్ఫరెన్స్ లోనే. హోమ్ క్వారంటైన్ లో ఉంటూనే! రాజకీయాలు చేసేస్తున్నారు. అయితే విధిలోకొచ్చి చేసే రాజకీయా లకు..ఇంట్లో ఉండే చేసే రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఇంట్లో రాజకీయాలు కన్నా వీధిలో రాజకీయాలు బలంగా పనిచేస్తాయి. ప్రస్తుతం అధికార పక్షం వైకాపా వీధిలో రాజకీయాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైకాపా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తుందని ప్రచారం సాగుతోంది.
వైకాపాకు చెందిన ఓ మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ కి గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నారంటూ హెచ్చరించారు. అది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గంటా శ్రీనివాసరావు సపోర్ట్ తో బోత్స సత్సనారాయణతో మంతనాలు చేసినట్లు ప్రచారం సాగింది. తాజాజా ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ చర్చకొచ్చింది. ఆ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వైకాపా లో చేరడానికి రెడీ అవుతున్నట్లు సోషల్ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. అదే జిల్లాకు చెందిన వైకాపా మంత్రి ఆ ఇద్దరితోనూ చర్చించినట్లు చర్చలు సఫలం అయినట్లు వినిపిస్తోంది.
ఈ నెల 27నే వైకాపా తీర్ధం పుచ్చుకోవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు చర్చకొచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఒకరు కరణం బలరాం ఇప్పటికే వైసీపీకి మద్దతునిస్తున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారే ఆలోనతో టీడీపీలో టెన్షన్ మొదలైందిట. ఇప్పటికే చంద్రబాబు ఫోన్ లో వారిని బుజ్జగించే కార్యక్రమం మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రకాశం నుంచి ఉన్న ఎమ్మెల్యేలను కూడా ఆకర్ష్ పేరుతో వైసీపీ లాగేసుకుంటే పరిస్థితి ఏంటని పార్టీ నేతల్లో చర్చకు దారి తీసిందిట. మరి చంద్రబాబు బుజ్జగింపులకు పడిపోతారా? ఆపరేషన్ ఆకర్ష్ కి ఆకర్షితులవుతారా? అన్నది కొద్ది రోజులు ఆగితేగానీ క్లారిటీ రాదు.