విశాఖ ఉత్తరం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొన్ని నెలలుగా రాష్ర్టంలో చోటు చేసుకుంటోన్న పరిస్థితులపై మౌనంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అధికార-ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నా ఆయన మాత్రం గమ్మున ఉంటున్నారు. గంటా కంచుకోటైన విశాఖలో గ్యాస్ దుర్ఘటన చోటు చేసుకున్నా కనీసం పరామర్శకి కూడా వెళ్లలేదు. నా పని నాదే..మీ పని మీదే అన్నట్లు వ్యవరించారు. ఇవన్నీ చూస్తుంటే అసలు గంటా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారా? అన్న అనుమానం కల్గుతోంది. అటు టీడీపీపైనా నోకామెంట్…అధికార పక్షంపైనా నో కామెంట్ అన్న వైఖరితోనే ఉన్నారు.
తాజాగా ఆయన ఇంట్లో గోల్పో ఆడుతోన్న ఓ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేసారు. చాలా రోజుల తర్వాత గోల్ఫ్ ఆడానని పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిలకిల శబ్ధాల మధ్య గోల్ఫ్ ఆడడంలో ఆహ్లాదం మరే పనిలోనూ లభించదని చెప్పారు. గోల్ఫ్ ఆడితే మనలోని శక్తిని పెంచుకున్నట్లేనని, చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు. దీంతో అసలు గంటా ఏంటి? పాలిటిక్స్ పై ఇంత అశ్రద్దగా ఉన్నారు? అన్న సందేహం పార్టీ వర్గాల్లో సైతం చర్చకు దారి తీస్తోంది. ఓ వైపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన…అమరావతి పర్యటన అంటూ నానా అవస్థలు పడుతుంటే అసలు ఆ విషయాలేవి పట్టనట్లే గంటా వ్యవరిస్తున్నారు.
పైగా గోల్ప్ గురించి గొప్పగా వర్ణించడంతో ఆసక్తి సంతరించుకుంది. గోల్పో మీనింగ్ రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల దక్కిన ప్రశాంతత? లేక? నిజంగానే గోల్ప్ ఆడటంతో వచ్చిన ఉత్సాహమా? అని స్థానిక ప్రజల్లో సహా రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మూడవ దశ లాక్ డౌన్ వరకూ పొలిటీషన్స్ సహా టాలీవుడ్ సెలబ్రిటీలు ఇళ్లలో ఉండి ఎంజాయ్ చేసారు. నాల్గవ దశ లాక్ డౌన్ లో రాష్ర్ట – కేంద్ర ప్రభుత్వాలు చాలా సడలింపులిచ్చాయి. అంతా ఇప్పుడిప్పుడే ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అవుతున్నారు. కానీ గంటా అంతా బిజీ అవుతోన్న టైమ్ లో రిలాక్స్ అవుతున్నారు. దీని గురించి ఓసారి చంద్రబాబు ఆలోచించాల్సిందే.