సబ్బం హరి ఇప్పుడు నీతిమంతుడు అయ్యాడా..?

sabbam hari cbn telugu rajyam

 విశాఖపట్నంలో సీతమ్మధార అంటే చాలా కాస్టలీ ఏరియా, హైదరాబాద్ లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ స్థాయిలో అక్కడ స్థలాలు చాలా ఎక్కువ ధరలో ఉంటాయి. కాబట్టి అలాంటి చోట్ల కబ్జాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కొందరు నేతలు అధికారంలో వున్నప్పుడు రికార్డ్స్ మేనేజ్ చేసి వాటిని ఆక్రమించుకోవటం జరిగింది. అదే కోవలోనే మాజీ విశాఖ మేయర్, మాజీ ఎంపీ సబ్బం హరి కూడా చేశాడనే మాటలు వినిపిస్తున్నాయి.

sabbam hari

 

  ఇప్పుడు అధికారం ఏమి లేకపోవటంతో అయన చేసిన అక్రమాలపై అధికారులు కొరడా రులిపిస్తూ అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అయితే దీనిపై సబ్బం హరి రెచ్చిపోయి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, విజయ సాయి రెడ్డిని, పనిలో పనిగా విశాఖలోని వైసీపీ నేతలను తిట్టటం స్టార్ట్ చేశాడు. నాకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ మాట్లాడిన సబ్బం హరి, అదే పాయింట్ తో కోర్టు కు వెళ్ళవచ్చు, ముంబైలో కంగనా ఆఫీస్ కూల్చివేసినప్పుడు నోటీసు విషయంపై కంగనా దైర్యంగా కోర్టు మెట్లెక్కింది. ఆమె వాదనలో నిజాయితీ వుంది కాబట్టి అలా చేసింది, కానీ సబ్బం హరి కోర్టుకు వెళ్లకుండా రాజకీయం చేయాలనీ చూస్తున్నాడు, ఎందుకంటే ముందు కోర్టులో నోటీసుల విషయం తేలిన తర్వాత ఆ స్థల వివాదం గురించి చర్చ జరుగుతుంది. అది అక్రమం కాబట్టి సబ్బం హరికి చివాట్లు తప్పవు, అందుకే కోర్టుకు వెళ్లకుండా తెలివిగా రాజకీయ రంగు పుస్తున్నాడు. ఆయనకి మద్దతుగా టీడీపీ పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారు.

  గతంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఇదే సబ్బం హరి అక్రమాలపై పోరాటం చేశాడు , టీడీపీ- వామపక్షాలు కలిసి ధర్నాలు చేశారు , ఇప్పుడేమో అవన్నీ మర్చిపోయి, సబ్బం హరి సత్యవంతుడు, ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. పార్క్ స్థలం ఆక్రమించి కట్టుకున్న దానిని అధికారాలు కూల్చివేయటంతో సబ్బం హరికి నోటికి ఏమి మాటలు వస్తున్నాయో కూడా మర్చిపోయి, రౌడీలా మాట్లాడటం ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేసింది. ఆయన మాటలను విశాఖ జిల్లా వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. స‌బ్బం హ‌రి నోటి దురుసుపై మంత్రి అవంతి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ సబ్బం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల‌ని… నువ్వు రౌడీ అనుకుంటున్నావా ఏంటి? అని గ‌ట్టిగా నిల‌దీశారు. హ‌రిని ఓట‌ర్లు హోం క్వారంటైన్‌కు పంపార‌ని, ఇప్ప‌టికైనా త‌ప్పు ఒప్పుకోవాల‌ని ఆదీప్‌రాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంత‌టి వారైనా చర్యలు తప్పవన్నారు. సరే విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అనుకోవచ్చు కానీ, మొన్నటిదాకా సబ్బం హరి కబ్జాదారుగా కనిపించిన టీడీపీ వాళ్ళకి నేడు ఆయన లో నీతిమంతుడు కనిపించటమే విచిత్రం..