30ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నాయకులు చేతిలో ఘోర అవమానం పొందుతున్నారు. ఇప్పుడే కాదు 2019 ఎన్నికల్లో ఓటమి వచ్చినప్పటి నుండి కూడా వైసీపీ నాయకుల చేతిలో బాబు అవమానాలు పొందుతూనే ఉన్నారు. టీడీపీ నాయకులు కూడా తక్కువేమీ తినలేదు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకులు ఘోరంగా అవమానించారు. అసలు వాళ్లను మనుషుల్లా కూడా టీడీపీ నాయకులు చూడలేదు. అలాగే ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా టీడీపీ నాయకుల పట్ల వ్యవహరిస్తున్నారు.
సభకు రాని టీడీపీ నాయకులు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 16 ననెలలు కావొస్తుంది. కాబట్టి ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చేసిన పనులను, పాలనలో ఉన్న తప్పులను అసెంబ్లీలో ప్రస్తావించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే కేవలం 12 మంది మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. చంద్రబాబు యొక్క ఆదేశాలను పట్టించుకోకుండా కొంతమంది టీడీపీ నాయకులు సభకు కూడా రాలేదు. వారిలో ఇప్పటికే వైసీపీకి మద్దతుగా ఉన్న వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి, కరణం బలరాం, గంటా శ్రీనివాసరావు ఉన్నారు. మిగిలిన వారిలో ఎమ్మెల్యే గొట్టిపాటి మొదటి రోజు రాకుండా రెండో వచ్చారు. అలాగే ఇప్పుడు నిమ్మల రామానాయుడు, మంతెన రాంబాబు కూడా అనుకున్న స్థాయిలో వాయిస్ వినిపించడం లేదని టీడీపీ చర్చ జరుగుతుంది.
సభకు రాని వాళ్ళు వైసీపీ వైపు చూస్తున్నారా!!
చంద్రబాబు నాయుడు ఆదేశాలను జారీ చేసినప్పుడు కూడా రాకుండా ఉన్న వాళ్ళు వైసీపీ వైపు ఏమన్నా చూస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మరోవైపు వైసీపీ నాయకులు చేస్తున్న అవమానాలను తట్టుకోలేక, ఆ అవమానాలను భరించలేక సభకు రావడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ నాయకులు చేస్తున్న అవమానాలను భరించి సభకు వెళ్లాల్సిన అవసరం లేదని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఈ కక్ష్యపురిత రాజకీయాలు ఎప్పుడు తగ్గుతాయో వేచి చూడాలి.