ఏపీలో అధికారక్షం-ప్రతిపక్షం మధ్య పొలిటికల్ వార్ పీక్స్ లో నడుస్తోంది. ఆరోపణలు-ప్రత్యారోపణల నడుమ రాజకీయం హీటెక్కుతోంది. వరుసగా జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బలు తగలడం…ఏపీలో చోటు చేసుకుంటోన్న తాజా పరిస్థితులు అన్ని ప్రభుత్వానికి ప్రతికూలంగా మారిపోతున్నాయి. వాటన్నింటిని టీడీపీ ఇప్పుడు అనుకూలంగా మార్చుకుని గుడ్ విల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా టీడీపీ దిళితలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు.
రాష్ర్టంలో దళితులను ఆదుకున్నది వైకాపా అని, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి..ఇప్పుడ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలబడింది వాళ్లిద్దరేనన్నారు. డాక్టర్ సుధాకర్ తరుపున వకల్తా పుచ్చుకుంటున్న టీడీపీ నేతలు, మొదట చంద్రబాబు నాయుడుతో దళితులకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేసారు. సుధాకర్ ని మ్యానేజ్ చేయడానికి టీడీపీ నేత వర్ల రామయ్య దిగాడానడం విడ్డూరంగా ఉందన్నారు. మ్యానేజ్ చేయడం టీడీపీ వాళ్లకే చెల్లిందిని ఎద్దేవా చేసారు. వ్యవస్థలు సహా వేటినైనా మ్యానేజ్ చేయడం టీడీపీకి మొదటి నుంచి ఉన్న ఆలవాటు, అందులో ఆ పార్టీకి రికార్డులు కూడా ఉన్నాయన్నారు. సుధాకర్ తో గానీ, ఆయన తల్లితో గాను తాను మాట్లాడినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు మంత్రి.
తన కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేసుకోవచ్చని అన్నారు. సుధాకర్ , వర్ల రామయ్య లాంటి వాళ్లను చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుని బలి పశువుల్ని చేస్తున్నారని దుయ్యబెట్టారు. రాష్ర్టంలో 13 జిల్లాలల్లో జులై 8న వైఎస్సార్ జయంతి నాడు 27 లక్షల మంది దళితులకు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ, పేద వర్గాలకు ఇళ్ల స్థలాలాను అడ్డుకుంటున్న వారిని దళిత ద్రోహులనాలా? లేక? వాళ మేలు కోరేవారు అనాలా? అని నిలదీశారు. చంద్రబాబు పల్లకీలు మోయడానికే దళితలు ఉన్నారని రుజువు చేసిన చరిత్ర టీడీపీ సొంతమన్నారు.