2019 ఎన్నికల్లో వచ్చిన ఓటమిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా నమ్మకాలేకపోతున్నారు. ప్రజల నుండి వచ్చిన, వస్తున్న వ్యతిరేకతను కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారు, అలాగే తన అనుభవం అంత వయసులేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒడిపోవడాన్ని ఇంకా తట్టుకోలేపోతున్నారు. ఆ బాధను నుండి కోలుకోలేని చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల సమయానికి వైసీపీని దెబ్బతియ్యడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే ఈ మాస్టర్ ను అమలు చెయ్యడానికి అయ్యన్న పాత్రుడుని బాబు నియమించారు.
అయ్యన్న ప్లాన్ ఏంటి?
వైసీపీని దెబ్బతీసే అతిపెద్ద పనిని సమర్ధవంతమైన అయ్యన్న పాత్రుడుకి చంద్రబాబు నాయుడు అప్పగించారు. టీడీపీ అమలు చేయనున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే వైసీపీ ప్రభుత్వం యొక్క అక్రమాలను బయటపెట్టి, కనీసం ఒక్క మంత్రినైనా పదవి నుండి దించేస్తే, ప్రజలకు వైసీపీపై ఉన్న నమ్మకం తగ్గిపోయి తమ పార్టీ వైపు ప్రజలు మొగ్గుచూపుతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతిని రోజుకొకకటి చొప్పును తెలుగుదేశం పార్టీ నేతలు బయపెడుతున్నారు.
గుమ్మనూరుపై చేస్తున్న ఆరోపణలు
టీడీపీ నేతలు పతకం ప్రకారం మంత్రి గుమ్మనూరు జయరాం చేస్తున్న అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఈఎస్ఐ స్కామ్ లో నిందితుడి వద్ద నుంచి జయరాం కుమారుడు బెంజికారును బహుమతిగా పొందారని, దాని ఫలితమే అతడు 14వ నిందితుడిగా మార్చారని అయ్యన్న ఆరోపించారు. అయితే తనకు బెంజికారు లేనే లేదని మంత్రి జయరాం కొట్టిపారేశారు.తాజాగా కర్నూలు జిల్లాలో భూవివాదాన్ని అయ్యన్న పాత్రుడు తెరపైకి తెచ్చారు. కర్నూలు జిల్లాలో 203 ఎకరాలను ఇట్టినా సంస్థ నుంచి జయరాం తన బంధువుల పేరిట, బినామీల పేరిట స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. మంత్రి అయిన తర్వాతనే ఈ భూదందాకు పాల్పడ్డారని అయ్యన్న ఆధారాలతో బయటపెట్టారు. అయితే ఈ ఆరోపణలను కూడా మంత్రి జయరాం కొట్టిపారేశారు. జయరాంపై టీడీపీ నాయకులు చేస్తున్న ఎంతోకొంత నిజం ఉండే ఉంటుంది. అయితే మరి ఈ ఆధారాల వల్ల, టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల వల్ల మంత్రి జయరాంను పదవి ఉంటుందో ఊడుతుందో వేచి చూడాలి.