Home Andhra Pradesh జగన్ కు షాక్ ఇచ్చిన టీడీపీ నేతలు, జగన్ వ్యూహానికి అడ్డుపడ్డ బాబు

జగన్ కు షాక్ ఇచ్చిన టీడీపీ నేతలు, జగన్ వ్యూహానికి అడ్డుపడ్డ బాబు

2019 ఎన్నికల్లో వైసీపీ టీడీపీని చాలా ఘోరంగా ఓడించింది. కానీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అంతటితో సంతోష పడటం లేదు. గతంలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన టీడీపీని ఆంధ్రప్రదేశ్ పూర్తిగా భూస్థాపితం చెయ్యడానికి రాష్ట్ర అభివృద్ధిపై కంటే కూడా ఎక్కువ శ్రద్ద పెట్టారు. అధికారంలోకి వచ్చిన మొదట నుండే టీడీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తూ, భయపెడుతూ వైసీపీలోకి లాక్కోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ టీడీపీ నేతలు మాత్రం జగన్ ను షాక్ ఇస్తున్నారు.
Cbn And Jagan | Telugu Rajyam

జగన్ కు షాక్ ఇచ్చిన టీడీపీ నేతలు

జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. జగన్ తొలుత ఎమ్మెల్యేలపైనే గురిపెట్టారు. ఎమ్మెల్యేలు తగినంత మంది వస్తే టీడీపీ శాసనసభపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనతో తొలినాళ్లలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ జగన్ ఆలోచనకు అనుగుణంగా ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ మాత్రమే వైసీపీకి మద్దతుగా నిలిచారు. అంటే 23 మంది ఎమ్మెల్యేలలో కేవలం నలుగురే వైసీపీ వైపు చూశారు. చాలా ప్రయత్నాలు జరిగినా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూడటం లేదు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్లు బలంగా విన్పించాయి. కానీ ఇప్పుడు వాళ్ళు టీడీపీలో కీలకంగా ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలను జగన్ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా టీడీపీ నేతలు మాత్రం జగన్ వైపు తిరగడం లేదు.

జగన్ వ్యూహాన్ని అడ్డుకున్న బాబు

వైసీపీ నేతలు ఇబ్బందులకు ఇప్పటికే చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లి ఉండాల్సింది కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ వ్యూహాలను ఉపయోగించి వాళ్ళను పార్టీలోనే ఉండేటట్టు చేశారు. పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని పేర్లు బయటకు వచ్చిన నేతలకు బాబు పార్టీకి సంబంధించిన కీలక పదవులు ఇస్తూ వాళ్ళను పార్టీలోనే ఉండేట్టు చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు తప్పించి వెళ్లేవారు లేరనే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. అదే జరిగితే జగన్ అనుకున్నది నెరవేరకపోవచ్చేమో.

- Advertisement -

Related Posts

వాళ్ళంతా గౌతమ్ సవాంగ్ కే చుక్కలు చూపిస్తున్నారు .. బాబోయ్ ఇది పరాకాష్ట !

ఆంధ్రప్రదేశ్: ఆలయాల మీద జరిగిన దాడుల మీద శుక్రవారం నాడు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కుట్రల వెనుక ఎవరున్నారన్నది బయట పెట్టారు. ఈ దాడుల వెనుక...

“అన్నా …మీరే న్యాయం చెప్పండి” అంటూ ఏడ్చేసిన అఖిలప్రియ!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేసిన ఘటనలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు కావటం.. ఆమె భర్తతో పాటు పలువురు అండర్ గ్రౌండ్ లో ఉండటం తెలిసిందే....

వెంకటేష్ నారప్ప రిలీజ్ ఎప్పుడు ..?

వెంకటేష్ నారప్ప సినిమా నుంచి అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్స్ అంతగా రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. రీమేక్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వెంకటేష్ మరోసారి తమిళ సూపర్ హిట్...

రవితేజ కాదు ఇప్పుడు శృతి హాసన్ కెరీర్ విజయ్ సేతుపతి చేతిలో ఉందా ..?

రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 2017 లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ రవితేజ కి హిట్ దక్కలేదు. దాదాపు మూడేళ్ళ తర్వాత...

Latest News