స్థానిక సంస్థల కోసం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నన్ని సంఘటనలు దేశంలో ఎక్కడా జరగడం లేదు. స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్, వైసీపీ ప్రభుత్వం మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. స్థానిక ఎన్నికలు గత మార్చిలోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. తర్వాత పరిణామాల నేపథ్యంలో వాయిదాపడడం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరోసారి షెడ్యూల్ రావడం, ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టుదలతో ఉండడం.. ఈ ఎన్నికలను స్వాగతిస్తూ.. టీడీపీ ప్రకటనలు చేయడం ఆసక్తిగామారాయి.
బాబు ఎన్నికల సర్వే చేయించాడా!!
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడానికి చంద్రబాబు నాయుడు చాలా తాపత్రయ పడుతున్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాన్ని చంద్రబాబు నాయుడు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఆ అపజయాన్ని స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ యొక్క సత్తాను మళ్ళీ చూపించాలని టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అనే విషయంపై బాబు సర్వే చేయించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆ ఫలితాలు కూడా చంద్రబాబుకు అనుకూలంగా లేవని తెలుస్తుంది.
వైసీపీ ఇంకా బలపడిందా!!
జగన్‌పై సానుభూతి ఇంకా కొనసాగుతోంది. జగన్ ప్రభుత్వం తమకు ఏదో చేయాలని ఆశిస్తోందని.. అయితే.. కోర్టుల ద్వారా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయనే వాదనను ప్రభుత్వం బలంగా తీసుకువెళ్లింది. గెలుపుపై ఆశల్లేకే చంద్రబాబు రోజుకో కొత్త డ్రామాకు తెరలేపుతోన్న పరిస్థితి. పైగా పింఛన్లను పెంచడంతోపాటు ఇళ్ల పంపిణీ, అమ్మ ఒడి, రైతు భరోసా.. సహా పలు కీలక పథకాలు బాగానే అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఆశలు అంత తేలికగా నెరవేరేలా కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.