జగన్ ఆ పని చేయకపోతే ఉరేసుకుంటా.. టీడీపీ నేత

tdp ycp

 రెండు రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ లో గీతం యూనివర్సిటీకి సంబధించిన విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రభుత్వం కేటాయించిన దానికంటే 40 ఎకరాలు పైగా ఆక్రమించి వాటిలో కొంత భాగంలో అక్రమ కట్టడాలు కట్టారు. అందుకే కూల్చేశామని ప్రభుత్వ వర్గాలు చెపుతుంటే, లేదు లేదు ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు ధోరణిలో భాగమే, టీడీపీ అనుకూల వ్యక్తుల ఆస్తులను నాశనం చేయటమే వైసీపీ లక్ష్యమంటూ టీడీపీ నేతలు చెపుతున్నారు.

bandaru satyanrayana telugu rajyam

 ఇదే క్రమంలో టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ ఒక అడుగు ముందుకేసి ఏకంగా వైసీపీ పార్టీ ఆఫీస్ ముందే ఉరేసుకుంటానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 18 కేసులు ఉన్న వ్యక్తి సీఎం అవడం తమ కర్మ అని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ పేరు పెట్టిన గీతంను కూల్చడం నిజంగా దౌర్భాగ్యమని అన్నారు. కరోనా సమయంలో గీతం ఆసుపత్రి విశేష సేవలందించిందని అది నిజం కాదని చెప్పమనండి వైసీపీ ఆఫీస్ ముందు ఉరేసుకుంటానని సవాల్ చేశాడు. వైసీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఆక్రమకట్టడాలు ఉన్నాయని, వాటిని కూల్చే దమ్ము జీవీఎంసీ అధికారులకు ఉందా అని ప్రశ్నించారు.

 ఇక్కడ చంద్రబాబు మాటలు కానీ, టీడీపీ నేతల మాటలు, వాళ్ళకి మద్దతు ఇచ్చే మీడియా మాటలు విన్నాకాని , గీతం కట్టడాలను కూల్చివేశారని అంటున్నారు తప్పితే అవి అక్రమ కట్టడాలు అనే పదం ఉపయోగించటం లేదు. అది అక్రమం కాకపోతే ఈపాటికే ఎల్లో నేతలు, ఎల్లో మీడియా చేసే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు, ఎవరు మాట్లాడిన గీతం చేసిన సేవలు మరచిపోయారా..? వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మాట్లాడుతున్నారు. గీతం యూనివర్సిటీ లో ఏమైనా ఉచిత విద్య పధకం అమలు చేయటం లేదు కదా..? లక్షల్లోనే ఫీజులు తీసుకుంటున్నారు కదా..!

gitam

 వైద్య కళాశాలలో ఉచిత వైద్యం అనేది గీతం వాళ్లే కొత్తగా పెట్టింది కాదు. వైద్య విద్య కాలేజీ నడిపించాలంటే, కచ్చితంగా హాస్పెటల్ ఉండాలి, అందులో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయాలనే రూల్ ఉండటంతోనే ఆసుపత్రి లో ప్రజారోగ్య సేవలు అందిస్తున్నారు… దానిని బ్యాలన్స్ చేయటానికి వైద్య విద్యలో భారీగానే ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఇక్కడ ఉచితంగా, ఉదారంగా ప్రజాసేవ ఎక్కడ చేసినట్లు,..?ఒక వేళా ప్రజాసేవ చేసిన కానీ ఇష్టం వచ్చిన రీతిలో అక్రమాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? గీతం విషయంలో ప్రభుత్వం చట్టాలకు లోబడే చర్యలు తీసుకుంది. ఒక వేళా ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుందని , ఈ విషయంలో గీతం వాళ్ళది తప్పులేదని భావిస్తే, కోర్టుకు పోవచ్చు కదా… అలా చేయకుండా అన్యాయం, అక్రమం అంటూ పాత చింతకాయ పచ్చడి డైలాగులు ఎందుకు..?