విజయవాడలో గురువారం జరిగిన హత్య గురించి అందరికీ తెలిసిందే. ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్యను నాగేంద్రబాబు అనే యువకుడు.. ఏకంగా తన ఇంటికే వెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత యువకుడు కూడా ఆత్మహత్యకు యత్నించారు. యువతి హత్య కేసులో ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు.
అయితే.. ఈ ఘటనపై టీడీపీ సీనియర్ లీడర్ వర్ల రామయ్య స్పందించారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళిత యువతిని విచక్షణారహితంగా చంపేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం నేరగాళ్లకు బాసటగా నిలుస్తోందని.. అందుకే హత్యలు ఎక్కువయ్యాయని దుయ్యబట్టారు. పోలీసుల భయం లేదు.. ప్రభుత్వ భయం లేదు.. ఎవరి భయం లేకుండా నేరగాళ్లు రెచ్చిపోతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుంటున్నదని ఆయన ఆరోపించారు.
ప్రేమ ముసుగులో దివ్య అనే యువతి బలైపోయింది. ఇప్పటికైనా సీఎం జగన్.. తన నీచ రాజకీయాలు పక్కన పెట్టి.. పాలనపై దృష్టి పెట్టాలి. ఒక దళిత యువతి హత్యకు గురయితే.. దళిత హోం మంత్రి ఇప్పటి వరక స్పందించలేదు. అసలు.. ఏపీ హోం మంత్రి ఎక్కడ ఉన్నారు? ఎందుకు ఈ ఘటనపై స్పందించడం లేదు. ఇదేనా మీకు దళితులపై ఉన్న ప్రేమ.. అంటూ రామయ్య… ఏపీ హోం మంత్రిపై ఫైర్ అయ్యారు.