జగన్ కుంభస్థలం కోసం టీడీపీ స్కెచ్!

ఏపీలో వైఎస్ జగన్ ను ఎక్కువగా ఓన్ చేసుకున్న సామాజికవర్గం ఎవరు అని అంటే… టక్కున చెప్పేది ఎస్సీలు, దళిత క్రైస్తవులు అని! వీరికి తోడు బీసీలు కూడా కలిశారని!! ఫలితంగా జగన్ అతిపెద్ద సునామీని సృష్టించారని. ఇది వైసీపీ నేతలే కాదు.. టీడీపీ నేతలు కూడా బలంగా నమ్ముతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎస్సీ, బీసీ ల ఓట్లకోసం టీడీపీ నేతలు కొత్త కొత్త ఫీట్లు చేస్తున్నారు. అందులో భాగంగా సామాజికవర్గాల వారీగా మీటింగులు పెడుతున్నారు.

విజయవాడలో ఎస్సి, బీసీ సామాజికవర్గాలకు చెందిన నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన ఎస్సీ నేతలు, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన సంఘాల నేతలతో టీడీపీ నేతలు వర్లరామయ్య, నక్కా ఆనందబాబు తదితరులు సమావేశమయ్యారు. బీసీ సంఘాల నేతలతో టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మీటింగ్ పెట్టారు. అయితే ఈ సందర్భంగా వర్ల రామయ్య, నక్క ఆనందబాబులు… ఎస్సీలకు టీడీపీ హయాంలో మేలు జరిగిందని, జగన్ హయాంలో మేలు జరగలేదు సరికదా దాడులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ… గత ఎన్నికల్లో టీడీపీని ఎస్సీ, బీసీలు ఎందుకు దూరం పెట్టారో వర్ల, నక్కా లకు తెలియదా అని కామెంట్లు మొదలైపోయాయి. 2014ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఎస్సీ, బీసీల విషయంలో చంద్రబాబు నియంత ధోరణి అవలంభించారు! ఎస్సీలను, బీసీ లను అవమానించేలా దిగజారిన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికక్కడ దళితులపై దాడులకు తెగబడ్డారు! మహిళలను కించపరిచేలా తమ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించినా వారిని అదుపుచేయలేకపోయారు.

కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అనే వ్యవహారం వెలుగులోకి వచ్చినా దానిపై ఉదాసీనంగా వ్యవహరించారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారంటూ దిగజారుడు మాటలు మాట్లాడారు.. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ మూర్ఖపు మాటలు మాట్లాడారు. ఫలితంగా… ఎస్సీలు, బీసీలు గంపగుత్తగా వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆ నమ్మకాన్ని జగన్ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎస్సీ, బీసీలకు అన్ని విధాలా పెద్దపీట వేస్తున్నారు. అయితే ఈ సామాజికవర్గ ప్రజలను తమవైపు తిప్పుకోవాలని టీడీపీ నేతలు బలంగా ఫిక్సయ్యారు. తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ… ఎస్సీ, బీసీ సామాజికవర్గ ప్రజలు మాత్రం టీడీపీని, చంద్రబాబునీ నమ్మే పరిస్థితుల్లో లేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి!!

గతం అంత సులువుగా మరిచిపోలేమని ఈ రెండు సామాజికవర్గ ప్రజలు భావిస్తున్నారంట. ఇప్పటికీ చంద్రబాబుకి దళితులన్నా, బీసీలన్న చిన్న చూపే ఉందని.. ఓట్లు వేయడానికి మాత్రం ఈ సామాజికవర్గ ప్రజలు కావాలి కానీ… పదవులు మాత్రం వేరేవారికి ఇస్తారని బలంగా భావిస్తున్నారంట. దీంతో.. మరోసారి రిస్క్ చేయడం ఎందుకు అని అనుకుంటున్నారని తెలుస్తుంది! మరి టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్ అవుతాయనేది వేచి చూడాలి!