గ్రేటర్ ఎన్నికలో టీడీపీ గట్టిపోటీ.. కామెడీ అదిరింది గురూ

tdp telugu rajyam

  పేరుకే తెలుగుదేశం జాతీయ పార్టీ తప్ప, కేవలం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకుంటూ ముందుకి వెళ్తుంది తప్పతే, తెలంగాణలో టీడీపీ గురించి అనుకోవటానికి ఏమి లేదు. ఆంధ్ర ప్రదేశ్ కి సంబదించిన విషయాల్లోనైనా చంద్రబాబు నాయుడు జూమ్ లో స్పదింస్తున్నాడు, తెలంగాణ విషయంలో అసలు కన్నెత్తి కూడా చూడటం లేదు. అలాంటిది వచ్చే GHMC ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తుంది. సరే గెలుపోటములు విషయం పక్కన పెడితే, ముందు మన బలాలు ఏమిటో, బలహీనతలు ఏమిటో ఒక అంచనా అనేది ఉండాలి. వాపుని చూసి బలం అనుకుంటే బొక్క బోర్లాపడుతారు.

ghmc

  ఇక ప్రస్తుత విషయానికి వస్తే తెలంగాణ వ్యాప్తంగా టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు 2018 ఎన్నికల తర్వాత దాదాపుగా తుడిచిపెట్టుకొని పోయిందనే చెప్పాలి. ఇక GHMC లో టీడీపీకి గతంలో మంచి పట్టు ఉండేది, సొంతగా మేయర్ దక్కించుకోలేకపోయిన కానీ, ప్రధాన ప్రతిపక్షముగా వుంటూ గట్టి పోటీ ఇచ్చేది. హైదరాబాద్ లో సెటిలైన ఆంధ్ర వాళ్ళందరూ టీడీపీని ఆదరించే వాళ్ళు, అయితే రాష్ట్ర విభజన జరగటం, చంద్రబాబు హుటాహుటిన ఆంధ్ర వెళ్లిపోవటంతో సెటిలర్స్ మెల్లగా తెరాస వైపు జరిగారు. గత GHMC ఎన్నికల్లోనే ఆ విషయం తేలిపోయింది. మహా కూటమిగా ఏర్పడి పోటీచేసిన టీడీపీకి ఒకే ఒక కార్పొరేటర్ స్థానం వచ్చింది. ఆ తర్వాత ఆయన కూడా తెరాసలో చేరిపోయాడు. ఆ పరిణామాలు తర్వాత అక్కడక్కడా కొంచం మిగిలున్న టీడీపీ అభిమానులు పూర్తిగా తెరాస వైపుకి వెళ్లిపోయారు. అయితే ఇవన్నీ తెలిసికూడా తెలియనట్లు నటిస్తుందో లేక మరేమిటో కానీ, వచ్చే GHMC ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్స్ లో దాదాపు 60 చోట్ల పోటీచేసి అక్కడ ప్రధాన పోటీదారుడిగా నిలవాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

  హైదరాబాద్ అభివృద్ధి జరిగింది టీడీపీ హయాంలోనే, కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర సెటిలర్స్ అందరు మళ్ళీ టీడీపీకే ఓట్లు వేస్తారని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే పరిస్థితులు టీడీపీ చేజారిపోయి జమానా కాలం అవుతుంది. అయినాసరే హైదరాబాద్ ని మేమె డెవలప్ చేశాం , హైటెక్ సిటీ మేమే కట్టమంటే నమ్మేసి, పొలోమంటూ ఓట్లు వేసే జనాలు ఎవరు లేరు…హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్ర సెటిలర్స్ లో టీడీప కి ఓట్లు వేస్తె అవి వృధాగా పోవటం తప్ప ఒరిగే లాభం లేదనే ఆలోచనలో వున్నారు. కాబట్టి టీడీపీ బలం ఏమిటో, వాపు ఏమిటో గ్రహిస్తే మంచిది. సరే నిండా మునిగిన వాడికి చలేమిటిలే అనుకోని దైర్యం చేసి అన్ని స్థానాల్లో పోటీచేసి మమ అనిపిస్తే సరిపోతుంది. ఎలాగూ జాతీయ పార్టీ అంటూ చెప్పుకుంటున్నారు కాబట్టి కొంచం జస్టిఫికెషన్ దొరికినట్లు అవుతుంది.