అన్నగారు స్థాపించిన స్థాపించిన టీడీపీ ఇప్పుడు రాష్ట్రంలో చాలా దయనీయమైన పరిస్థితిల్లో ఉంది. అన్నగారి తరువాత చంద్రబాబు నాయుడు కూడా చాలా బాగా పార్తిని నడిపించారు. అయితే ఇప్పుడు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయితే పార్టీకి ఈ గతి పట్టడానికి చంద్రబాబు నాయుడు యొక్క ప్రవర్తనే కారణమని పార్టీ సీనియర్ నేతలు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
చంద్రబాబు ప్రవర్తనలో ఉన్న లోపం ఏంటి?
చంద్రబాబు నాయుడు వేసిన రాజకీయ వ్యూహాలకు ఇప్పటికే చాలామంది నాయకులు ఇళ్లకు పరిమితం అయ్యారు. అయితే ఆయనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అవే ఇప్పుడు పార్టీని ప్రమాదంలోకి నెట్టింది. చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ ఆ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాప్యం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్లే పార్టీ ప్రమాదంలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కీలక సందర్భాలలో కూడా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తూ ఉంటారు. ఇందుకు నిదర్శనం గన్నవరం విషయంలో కూడా తెలుస్తుంది.
గన్నవరంలో కూడా జాప్యం
గన్నవరంలో వల్లభనేని వంశీ టీడీపీ వీడి ఇప్పటికే ఏడూ నెలలు గడుస్తున్నా కూడా ఇక్కడ పార్టీ ఇంచార్జ్ ను నియమించడంతో జాప్యం చేస్తున్నారు. గన్నవరం టీడీపీకి కంచుకోట. అక్కడ కూడా పార్టీ ఇంచార్జ్ ను నియమించడంలో ఇంత ఆలస్యం చెయ్యాలా అంటూ పార్టీ సీనియర్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంశీ పార్టీని విడిన ఏడూ నెలలకు ఇప్పుడు బచ్చుల అర్జునుడును నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. అర్జునుడు పేరు మొదటి నుండి వినిపిస్తున్నా కూడా దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంతకాలం అవసరమా అని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. చాలా సందర్భాలలో చంద్రబాబు యొక్క నాన్చుడు ధోరణి పార్టీకి చాలా నష్టం చేస్తుంది.