వైసీపీలో వర్గపోరు పలు నియోజకవర్గాల్లో పార్టీ మనుగడకే ముప్పు తెస్తోంది. ఎమ్మెల్యేలకు ఎంపీలకు సయోధ్య లేకపోవడం ప్రత్యర్థులకు అవకాశంగా మారింది. అందుకు ఉదాహరణే గుంటూరు జిల్లాలో కీలకమైన తాడికొండ నియోజకవర్గంలోని పరిస్థితులు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ మీద ఆమె కేవలం నాలుగు వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడ బలంగానే ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున శ్రవణ్ కుమార్ నెగ్గారు. అంటే రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంది.
వైఎస్ జగన్ ఛరీష్మా ఉండబట్టి ఉండవల్లి శ్రీదేవి గెలవగలిగారు లేకపోతే కానీ రాజకీయాలకు కొత్త అయిన ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే మీద గెలవడం దాదాపు అసాధ్యమే అనాలి. ఎలాగోలా ఫ్యాన్ గాలిలో గెలిచారు కాబట్టి ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో తనకంటూ సొంత బేస్ క్రియేట్ చేసుకునే దిశగా ఆమె పనిచేయాలి. కానీ వరుస వివాదాలలో చిక్కుకుంటూ ఉన్న ఇమేజ్ కూడ డ్యామేజ్ అయ్యేలా నడుచుకుంటున్నారు ఆమె. ఇదే ప్రత్యర్థి టీడీపీకి సానుకూలంగా మారింది. టీడీపీ నేత శ్రవణ్ కుమార్ శ్రీదేవి మీదున్న ఈ నెగెటివ్ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారట.
పైగా ఎంపీ నందిగాం సురేష్, శ్రీదేవిల మధ్య కొన్నాళ్లుగా సయోధ్య లేదు. ఇరువురి నడుమ వర్గపోరు నడుస్తోంది. ఒకరకంగా శ్రీదేవి మీద వివాదాలు వెలుగుచూడటానికి కారణం కూడ ఈ వర్గపోరే కారణమనే వాదన కూడ వినిపించింది. ఓటమితో ఇన్నాళ్లు నిరుత్సాహంగా ఉన్న టీడీపీ నేత శ్రవణ్ కుమార్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారట. పార్టీ శ్రేణులను రంగంలోకి దింపి పుంజుకునే పని మొదలుపెట్టారట. ఎమ్మెల్యే మీద వస్తున్న ఆరోపణలను వాడుకుంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే సిట్యుయేషన్ ఇంకొన్నాళ్ళు సాగితే వచ్ఛే ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని భావించిన వైసీపీ హైకమాండ్ ముందు ఎమ్మెల్యే, ఎంపీలకు మధ్య సమోధ్య కుదిర్చే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. అలాగే ఎమ్మెల్యేకి ఎలా పనిచేయాలో సూచనలు, సలహాలు ఇస్తూ రిపేర్లు చేసే పనిలో పడింది.