జగన్ మర్చిపోయిన పాయింట్ లో చంద్రబాబు కేర్ ఫుల్ గా డీల్ చేస్తున్నాడు ! 

 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు మంచి చేయాలంటే పరిపాలనా అనుభవం అవసరం లేదని, మంచి మనసు ఉంటే చాలని నిరూపించారు.. వైసీపి పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కొందరు వైఎస్ జగన్ పాలన మీద అనుమానం వ్యక్తం చేశారు. కొత్త సీయం పాలన ఎలా ఉండబోతుందో అనే ఆసక్తిని కనబరిచారు.. కానీ తొందరగానే వారి అనుమానాలను పటాపంచాలు చేశారు వైఎస్ జగన్.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు.. అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నెలకొల్పిన సీఎం జగన్‌ పని తీరును ప్రధాని మోదీ కూడా మెచ్చుకోవడం విశేషం.

ఇకపోతే రాజ‌కీయాల్లో కీల‌క‌మైన వ్యూహ‌క‌ర్త‌గా పేరు తెచ్చుకుని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా.. పార్టీని నడపడంలో యువకుడైన వైఎస్‌ జగన్‌ను అనుసరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల్ని మార్చడంపై తెలుగుదేశం పార్టీలో కసరత్తు సాగుతోందట.. ఇక గ‌త ఏడాది ఎన్నిక‌ల ప‌రాభ‌వం నుంచి పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని చంద్రబాబు చూస్తున్నారా అంటే తాజా ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తున్న నాయ‌కులు ఔన‌నే అంటున్నారు. అయితే సీఎం జ‌గ‌న్‌ ఏపీలో ప్ర‌తి పార్ల‌మెంటు స్థానాన్ని ఒక జిల్లాగా మారుస్తామ‌ని చెప్పారు కానీ ఇంకా ఆ దిశగా చ‌ర్య‌లు ప్రారంభించ‌లేదు.

 

ఒకవేళ పార్ల‌మెంటు స్థానాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తే ప్ర‌తి పార్టీ కూడా వ్యూహాలు మార్చుకోవాలి. ఈ సమయంలో టీడీపీ వంటి పార్టీకి ఈ అంశం మరింత ప్ర‌తిబంధ‌కంగా ఉండే అవ‌కాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ముందుగానే గ్రహించినట్లుగా ఉన్న చంద్రబాబు రాజ‌కీయ క‌మిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఒకరకంగా జగన్ మరచిపోయిన అంశాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నాడట.. ఈ మేరకు 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులను నియమించేందుకు అవసరమైన కసరత్తు పూర్తి చేశారు. అంటే ఇకపై 13 జిల్లాల అధ్యక్షుల స్థానంలో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీలో ఉండబోతున్నారన్న మాట.. ఇక వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి పరిపాలనా అనుభవం లేదు. నేను సీనియర్‌ను అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ విధానాన్నే రాజకీయంగా కూడా పాటిస్తుండడం గమనార్హం.