బీజేపీతో చేతులు కలిపేందుకు టీడీపీ క్యాడర్ సిద్ధం.!

ఎప్పుడెప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుందామా.? అని ఎదురుచూస్తోంది తెలుగుదేశం పార్టీ క్యాడర్. ఇదేనా, ఈ పార్టీయేనా.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తన సొంతమని చెప్పుకుంటోన్నది.? ఔను, ఇందులో డౌటేముంది.? రాజకీయాలంటేనే అంత.! అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘హుందాతనం’ అనీ, ఇంకోటనీ.. ఏవేవో చెబుతుంటారు. దారుణంగా బీజేపీ నేతలు చంద్రబాబుని తిట్టారు. చంద్రబాబు తక్కువేం తిన్లేదు, బీజేపీని నానా రకాలుగా తిట్టారు. అవన్నీ మర్చిపోయి, బీజేపీతో కలిసిపోవడానికి చంద్రబాబు అండ్ టీమ్ సిద్ధమైపోయింది.

‘అబ్బే, మేం టీడీపీతో కలవట్లేదు..’ అని ఏపీ బీజేపీ నేతలు కొందరు ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారు. కానీ, తెరవెనుకాల జరగాల్సింది జరిగిపోయింది. త్వరలో, అతి త్వరలో బీజేపీ అధిష్టానం నుంచి క్లారిటీ రాబోతోంది. చంద్రబాబు – మోడీ కలిసి ఓ ప్రకటన చేయబోతున్నారట. అలాంటి మీటింగ్ కావాలని చంద్రబాబు స్వయంగా ప్రధాని మోడీని అడిగారట.

ఢిల్లీలో గత కొద్ది నెలలుగా మకాం వేసిన చంద్రబాబు సన్నిహితుల బృందం, ఈ డీల్‌ని వర్కవుట్ చేసినట్లుగా చెబుతున్నారు. సీట్ల పంపకం తదితర విషయాల్లో బీజేపీకి పెద్దగా షరతులేవీ చంద్రబాబు విధించబోవడంలేదట. అంతే కాదు, ముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా వైఎస్ జగన్ ఓ మెట్టు దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.

‘జనసేనతో పొత్తు పెట్టుకుందాం..’ అని ఎప్పటినుంచో టీడీపీ కార్యకర్తలు అధినేతను బతిమాలుకుంటున్న విషయం విదితమే. మరీ, అంత కరువుతో వున్న టీడీపీ కార్యకర్తలు, బీజేపీ పిలవకుండానే బీజేపీ కండువాలు భుజాన మోసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకీ, దసరా వరకూ అయినా టీడీపీ ఆగుతుందా.? ఈలోగానే, ‘మేం సమర్పించేసుకున్నాం..’ అని ప్రకటిస్తుందా.? వేచి చూడాల్సిందే.