కరెక్టే.. ఎప్పుడైనా ఒక పార్టీకి.. మరో పార్టీకి అస్సలు పడదు. అవి ఇంకా బద్దశత్రువులైతే ఆయా పార్టీల నేతలు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. అయితే… అది ఏ రాష్ట్రమయినా.. ఏ పార్టీ అయినా.. దాని అల్టిమేట్ గోల్ ఏంటి? రాష్ట్రం బాగుండటం.. రాష్ట్రం అభివృద్ధి చెందడం… రాష్ట్ర ప్రజలు బాగుండటం.
ఏ పార్టీ అయినా ప్రజల్లోకెళ్లి ఓట్లడిగేది ప్రజల సంక్షేమం కోసమే. ప్రజలు బాగుండాలనే అన్ని పార్టీలు కోరుకుంటాయి. దానితో పాటు రాష్ట్రం కూడా బాగుండాలి. వేరే చోట రాష్ట్రం పరువు పోకుండా చూసుకోవాలి.
కానీ.. ఏపీలో అంతా రివర్స్ గా ఉంది. పార్లమెంట్ లో ఓవైపు టీడీపీ నేతలు.. మరోవైపు వైసీపీ నేతలు.. రెండు పార్టీల నేతలు రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి… ఒకరిపై మరొకరు బురద జల్లుకొని చివరకు రాష్ట్ర పరువును గంగలో కలిపేస్తున్నారు.
ఓవైపు వైసీపీ ఎంపీలేమో… అమరావతి భూకుంభకోణంపై సీబీఐ విచారణ చేయించాలంటారు. కేంద్రాన్ని కోరుతారు.. మరోవైపేమో… టీడీపీ ఎంపీలు ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని… ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటారు.
ఇలా.. ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకొని కేంద్రం దగ్గర ఏపీ పరువు తీయడం కాకపోతే వీళ్లు చేసేదేంటి? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర దగ్గర కూడా ఇలా చిన్నపిల్లల్లా ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉండటం వల్లనే ఏపీని అందరూ చులకనగా చూస్తున్నారు.ఏ పార్టీ అయినా ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి కానీ.. తమ రాజకీయ లబ్ధి కోసం వేరే వాళ్లను పణంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్.. అనే వార్తలు వినిపిస్తున్నాయి.
వైసీపీ, టీడీపీ మధ్య ఏదైనా వైరం ఉంటే అది ఇక్కడే చూసుకోవాలి కానీ… కేంద్ర ముందు చులకన అయి రాష్ట్ర పరువు తీసి ఏం సాధిస్తారు? కేంద్రం దగ్గర ఏపీకి రావాల్సిన నిధుల మీద పోట్లాడాలి? రాష్ట్రానికి రావాల్సిన హామీల మీద కొట్లాడాలి? కానీ.. ఇలా ఒకరి మీద మరొకరు చెప్పుకోవడం దేనికి నిదర్శనం.. అనే వార్తలు గుప్పుమంటున్నాయి.