జోబులో 10 లేకున్నా బుర్రలు వందకోట్ల ఆలోచనలు ఉండేవి.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

విజయ్ దేవరకొండ రీతూవర్మ పెళ్లి చూపులు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అనంతరం పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇలా పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఎంతో బిజీగా ఉన్న తరుణ్ భాస్కర్ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాను ఎన్నో విషయాల గురించి ఆలీతో సరదాగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ తాను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎన్నో కథలు సిద్ధం చేసుకుంటూ ఉండేవాడిని. అవకాశాల కోసం ఆ కథలను పట్టుకుని ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతూ ఉండేవాడినని,ఆ సమయంలో తన జేబులో పది రూపాయలు లేకపోయినా బుర్రలో మాత్రం వందకోట్ల ఆలోచనలు ఉన్నాయని ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే విజయ్ దేవరకొండతో పరిచయం ఎలా ఏర్పడిందనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ విజయ్ గల్లీ థియేటర్లలో ఆర్టిస్టుల తిరుగుతూ ఉండేవాడు, తనతో పాటు నేను కూడా తిరుగుతూ ఉండే వాడిని.. మాదంత ఎయిర్ఫోర్స్ బ్యాచ్ అంటూ తనతో ఉన్న పరిచయం గురించి బయట పెట్టారు.ఇకపోతే విజయ్ దేవరకొండ తర్వాత సినిమా చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా తన లైఫ్ కి విజయ్ దేవరకొండ వైల్డ్ కార్డ్ లాంటివాడని,ఎప్పుడైతే తనకు వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు వస్తాయో ఆ టైంలో విజయ్ దేవరకొండను వైల్డ్ కార్డ్ గా ఉపయోగిస్తానని ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ వెల్లడించారు.