Ajith Kumar :మన దగ్గర తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఎలాగో తమిళ నాట ఆ స్థాయి క్రేజీ ఉన్న హీరోలు అజిత్ కుమార్ మరియు విజయ్ లు. అయితే వీరి సినిమాలు వస్తున్నాయి అంటే కోలీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నెలకొల్పుతాయి. అయితే వీరి క్రేజ్ కి తగ్గట్టు గానే నిర్మాతలు కూడా భారీ రెమ్యునరేషన్స్ ని ఇచ్చేందుకు వెనకాడరు.
అయితే ఇప్పుడు ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు అనేది క్లారిటీగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు అజిత్ చేయబోయే తన 62వ సినిమా పారితోషికం మాత్రం షాకింగ్ లెవెల్లో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాకి గాను అజిత్ ఏకంగా 102 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు కోలీవుడ్ సినిమా వర్గాలు తెలియజేశాయి. ఇది మాత్రం సెన్సేషన్ అనే చెప్పాలి.
అలాగే దక్షిణాదిలోనే కాకుండా టోటల్ ఇండియా సినిమా దగ్గరే అజిత్ తీసుకుంటున్న ఈ పారితోషికం ఒక రికార్డు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి ముందు అజిత్ నటించిన భారీ ఆక్షన్ డ్రామా “వలిమై” పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అని కూడా అందుకుంది. అలాగే ఈ చిత్రం ఈరోజు మార్చ్ 24 నుంచే ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యింది.