Ajith: తమిళ హీరో అజిత్ ఫ్యామిలీ ఫొటోస్ వైరల్..?

Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అజిత్ తాజాగా నటించిన చిత్రం వలిమై. ఈ సినిమా ఇటీవలే విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి సక్సెస్ అయిన సందర్భంగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు గా నూరు కోట్ల క్లబ్ కు చేరుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో అజిత్ ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అజిత్ తన భార్యా పిల్లలతో కలిసి రెస్టారెంట్ లో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తనకు సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీ కోసం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాడు అజిత్. అయితే అజిత్ ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలు చాలా అరుదుగా బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. తాజాగా తన కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా భార్య శాలిని, కూతురు అనౌష్క, కుమారుడు అద్విత్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.