క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో మొదటిది ఖిలాడి. రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే మొదటి నుండి ఈ సినిమాకు అక్కడక్కడా అంతరాయాలు ఎదురవుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ ప్రభావంతో ఆఖరి దశ షూటింగ్లో ఉన్న సినిమా నిలిచిపోయింది. మాములుగా అయితే లాక్ డౌన్ ఎత్తివేయగానే ఈ సినిమానే ముందుగా రవితేజ ఈ సినిమానే రీస్టార్ట్ చేయాలి. కానీ కొత్త సినిమాను పట్టాలెక్కించారు.
అదే రామారావ్ ఆన్ డ్యూటీ. ఈ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ మొదలైంది. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తరువాతనే ఖిలాడి షూట్ రీస్టార్ట్ చేస్తారట రవితేజ. అంటే ఇంకో రెండు నెలల తరవతా కానీ రవితేజ ఖిలాడి సెట్స్ మీదకు వెళ్లలేరు. అదీ కాకుండా ఈ సినిమా వర్క్ చాలానే పెండింగ్ ఉందట. దాదాపు రెండు నెలల షూటింగ్ జరిగితేనే సినిమా పూర్తవుతుందట. అంటే సినిమా విడుదల ఈ ఏడాది చివర్లోనే ఉండబోతుంది.