అస్వస్థకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్..

తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అస్వస్థతకు గురవడంతో ఆయనకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఈ విషయం గురించి తమిళనాడు రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్ అన్నారు. శనివారం రోజు ఆయనకు జ్వరం వచ్చింది అని.. 2 రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు అని అన్నారు.

ఇక ఆయన అనారోగ్యం అలా ఉండటంతో మరో మూడు జిల్లాల్లో జరగాల్సిన పర్యటన రద్దయింది అని తెలిపారు. గతంలో ఆయన వేలూరు, తిరుపత్తూర్, రాణి పేట జిల్లాలో ఆయన పర్యటన చేయాల్సి ఉంటుంది అని ప్రకటించగా.. ఆ పర్యటనకు డీఎంకే శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. సరైన సమయానికి ఆయన అస్వస్థతకు గురవడంతో ఆయన పర్యటన రద్దయింది.