Venu Swamy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రస్తుతం సంచలనాలను సృష్టిస్తుంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది. కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సుమారు 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపిస్తోంది. ఇలా ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసేలోపే అల్లు అర్జున్ ఊహించని విధంగా జైలు పాలు కావాల్సి వచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అభిమాని మరణించడంతో అందుకు అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు తనని అరెస్టు చేయడంతో ఎంతోమంది ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
పలువురు రాజకీయ నాయకులు కేంద్ర మంత్రులు సైతం అల్లు అర్జున్ అరెస్టు చేయడం నూటికి నూరు శాతం తప్పని తెలియజేశారు. ఇలా అరెస్టు చేసుకుంటూ పోతే రాజకీయ నాయకులు అందరూ కూడా ఈపాటికి జైల్లోనే ఉండాల్సి వచ్చేదని కామెంట్లు చేశారు.. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ జైలుకు పోయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ముఖ్యమంత్రులు అవుతున్నారు. మరి అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లారు కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమంటూ వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ కచ్చితంగా పార్టీ పెడతారని ఇలా పార్టీ పెట్టి రాజకీయాలలోకి వస్తే ఆయన 100% ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రదుమారం రేపుతున్నాయి.
మరోవైపు అభిమానులు నేటిజన్స్ ఈ వీడియో ఫై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ కు రాజయోగం ఉందని వేణు స్వామి చెప్పారు కట్ చేస్తే ఆయనని పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టారు రాజయోగం అంటే ఇదేనా వేణు స్వామి అంటూ ఈయన వీడియోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
What a vision, what a thought…
పిచ్ఛోళ్ళు అయిపోయారు ఫ్యాన్స్ అంతా 😳😳😳 pic.twitter.com/0niPip5Zrp— Sandhya Reddy YSCRP 🇱🇸 (@SandhyaSamayam) December 14, 2024