తమన్నాకి ఈ రోల్ చెయ్యడం బాగా కష్టం అనిపించిందట.!

మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్న మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. దాదాపు పదేళ్లకి పైగా సినిమాలో ఉంటూ ఇప్పటికీ అదే గ్లామర్ మరియు ఎనర్జీ తో తమన్నా అదరగొడుతుంది. అయితే ఇప్పటి వరకు ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేసిన తమన్నా తన శక్తికి మించి చాలా బలమైన రోల్స్ కూడా చేసింది. 

కానీ ఒక వెరీ ఫన్నీ రోల్ మాత్రం ఇప్పటివరకు తాను చేసిన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో చాలా కష్టంగా అనిపించింది అని చెప్తుంది. లేటెస్ట్ గా తమన్నా సోషల్ మీడియాలో ఓ చిట్ చాట్ నిర్వహించగా ఆమెకి ఈ ప్రశ్న ఎదురయ్యింది. ఇప్పటివరకు చేసిన రోల్స్ లో మీకు బాగా కష్టంగా అనిపించింది ఏది అంటే.. తన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా అయినటువంటి “ఎఫ్ 3” లో రోల్ అట. 

ఎఫ్ 3 లో అంటే మళ్ళీ ఆమె హీరోయిన్ గా చేసింది కాదు అందులో మగాడిలా యాక్ట్ చెయ్యడం చాలా కష్టంగా అనిపించింది అని తమన్నా ఆ ఫన్నీ రోల్ వెనుక తాను పడ్డ కష్టం కోసం చెప్పింది. ఈ మధ్య కాలంలో కూడా తమన్నా చేసినలాంటి రోల్ మరో హీరోయిన్ చేసినట్టు చూడలేదు. అలాంటిది తమన్నా కాస్త కష్టం అయినా ఈ రోల్ ని మాత్రం సూపర్ గా చేసిందని చెప్పాలి.