కొత్త దారుల్లో రెండు చేతులా సంపాదిస్తున్న తమన్నా

Tamanna to turn host for cooking show
Tamanna to turn host for cooking show
 
మిల్కీబ్యూటీ తమన్నా క్రేజ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కొద్దిగా తగ్గిందనే అనాలి. ఇదివరకు పెద్ద హీరోల సినిమాలంటే తమన్నా పేరు ఖచ్చితంగా పరిశీలనలో ఉండేది. కానీ ఇప్పుడు ఉండట్లేదు. ఏదో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ మినహా స్టార్ హీరోల సిమిమాల కోసం ఆమెను అప్రోచ్ అవ్వడం తగ్గించేశారు చాలామంది దర్శక నిర్మాతలు. అయితే తమన్నా డీలాపడలేదు. కొత్త దారులు వేటుకుతోంది. పెద్ద సినిమాల్లో ఆఫర్లు లేకపోయినా చిన్న సినిమాలు ఆమెకు అడపాదడపా వస్తూనే ఉన్నాయి. అవి కాకుండా ఓటీటీల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఓటీటీ సంస్థలకు లేడీ ఓరియెంటెడ్ కంటెంట్ చేసే వారికి తమన్నా ఒక మంచి ఆప్షన్ అవుతోంది.  
 
ఇప్పటికే పలు ఓటీటీ ప్రాజెక్ట్స్ చేసిన ఆమె ఇంకా రెండు మూడు ప్రాజెక్ట్స్ సైన్ చేసి ఉంది. ఇవి మాత్రమే కాకుండా బుల్లి తెర మీద కూడా హడావుడి చేయడానికి తమన్నా రెడీ అవుతోంది. ఆమె ఒక రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది.  జెమినీ టీవీ పాపులర్ షో అయిన ‘మాస్టర్ చెఫ్’ను తెలుగులో రూపొందించనుంది. ఈ షోకు తమన్నా హోస్ట్. ఇతర భాషల్లో విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, పృథ్విరాజ్ సుజుమారన్ లాంటి వాళ్ళు ఈ షోను హోస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికిగాను తమన్నాకు పారితోషకం గట్టిగానే అందుతోందట. మొత్తానికి తమన్నా పెద్ద సినిమాల్లో ఆఫర్లు రాకపోయినా ఇతర అవకాశాలను అందిపుచ్చుకుని రెండు చేతులా సంపాదిస్తోంది.