సంపాదించడం ఎలాగో తమన్నాను చూసి నేర్చుకోవాలి

Tamanna charging bomb for Amazon Web series
Tamanna charging bomb for Amazon Web series
 
దాదాపు దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ల జాబితాలో కొనసాగింది తమన్నా. ప్రస్తుతం ఆమెకు హీరోయిన్ ఆఫర్లు బాగా తగ్గాయి. దాదాపు అందరు పెద్ద హీరోలతోనూ సినిమాలు చేసేసింది. అందుకే పెద్ద సినిమాల దర్శకులు ఈమెను కన్సిడర్ చేయట్లేదు. ఈ పరిస్థితుల్లో ఏ హీరోయిన్ అయినా తట్టా బుట్టా సర్దేసుకుంటుంది. మెల్లగా ఫెడ్ అవుట్ అయిపోతోంది. అలా కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ తమన్నా మాత్రం కష్ట కాలంలో కొత్త దారులు వెతుక్కుంటోంది. బుల్లితెర మీద రియాలిటీ షోకు సైన్ చేసింది. జెమినీ టీవీ ప్రసారం చేయనున్న కుకింగ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది.  
 
ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వచ్చిన డిజిటల్ స్ట్రీమింగ్ మీద కూడ దృష్టి పెట్టింది. ఓటీటీ ఆఫర్లు పట్టుకుంది. మిగతా హీరోయిన్లలా ఓటీటీలకు వెనుకాడలేదు. వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది.  ఇటీవలే ‘నవంబర్ సిరీస్’ వెబ్ సిరీస్ చేసి మెప్పించిన ఈ మిల్కీబ్యూటీ తాజాగా ఇంకొక వెబ్ సిరీస్ కు సైన్ చేసింది.  అది కూడ భారీ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సంస్ధతో కావడం విశేషం.  నిర్మాత దినేష్ విజన్ దీన్ని నిర్మించనున్నారు.  అరునిమ శర్మ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారు.  తమన్నాతో పాటుగా ఆశిమ్ గులాటి ఇందులో లీడ్ రోల్ చేయనున్నాడు.  ‘యారి’ దోస్తీ అనేది ఈ వెబ్ సిరీస్ టైటిల్.  ఇది పూర్తిగా స్నేహం అనే కాన్సెప్ట్ మీద నడిచే స్టోరీ.  సెప్టెంబర్ నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలై 2022లో రిలీజ్ అవుతుందట. దీనికి గాను తమన్నా భారీ పారితోషకమే పుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది.