Tamanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే తమన్నా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘డు యూ వనా పార్ట్‌నర్.
త్వరలోనే ఈ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మిల్కీ బ్యూటీ. ఇందులో బాలీవుడ్ నటి డయానా పేంటీ కూడా నటించిన విషయం తెలిసిందే. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమాలో తమన్నాలో మరో కొత్త కోణాన్ని చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె అభిమానులకు ఈ ప్రాజెక్ట్ తప్పకుండా నచ్చుతుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్ లో భాగంగా సెప్టెంబర్ 12న డు యూ వనా పార్ట్‌నర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇద్దరు స్నేహితులు ఆల్కహాల్ స్టార్టప్ తో భాగస్వాములుగా మారి కొనసాగిన వారి జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించారు. పురుష ఆదిపత్యం ఉన్న ఈ పరిశ్రమలో ఇద్దరు మహిళలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో నటించారు. తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటి డయానా నటించినట్లు తెలుస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.

