Peddi: చరణ్ సినిమా స్పెషల్ సాంగ్ లో చిందులు వేయనున్న క్రేజీ బ్యూటీ…. ఎవరో తెలుసా?

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పెద్ది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. రామ్ చరణ్ చివరిగా గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియో విడుదల చేశారు అయితే ఈ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో కూడా బుచ్చిబాబు ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం కిరాక్ హీరోయిన్ ను రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరి రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిందులు వేయబోతున్న ఆ బ్యూటీ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు.. రామ్ చరణ్ సరసన రచ్చ సినిమాలో నటించిన ప్రేక్షకులను సందడి చేసిన నటి తమన్న తిరిగి చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. ఇటీవల కాలంలో తమన్న పెద్ద ఎత్తున స్పెషల్ సాంగ్స్ చేస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ తరుణంలోనే పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిందులు వేయబోతున్నట్టు తెలుస్తుంది.