AP: తల్లికి వందనం పథకం అమలు అప్పుడే… క్లారిటీ ఇచ్చిన మంత్రి డోలా ?

AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో విఫలమైందంటూ ఒకవైపు వైకాపా పార్టీ నేతలు నాయకులు తరచు విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా దశలవారీగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇలా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలలో తల్లికి వందనం పథకం కూడా ఒకటి. జగన్మోహన్ రెడ్డి హయామంలో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్న ఒక విద్యార్థికి మాత్రమే 15 వేల రూపాయలు వారి తల్లి ఖాతాలో వేసేవారు కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయలు చొప్పున వారి తల్లుల ఖాతాలో జమ చేస్తామనీ తెలిపారు.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విద్యా సంవత్సరం కూడా పూర్తి అవుతుంది కానీ ఇప్పటివరకు తల్లికి వందనం పథకం అమలు చేయకపోవడంతో ఎంతో మంది తల్లితండ్రులు కాస్త ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలోనే తల్లికి వందనం పథకం అమలు గురించి తాజాగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి క్లారిటీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం పథకం గురించి మాట్లాడారు.

గత5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్రం అప్పులలో కూరుకుపోయింది అందుకే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో తల్లికి వందనం పథకం ఒకటి. అయితే ఈ పథకాన్ని ఈనెల మేలో అమలు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నామని డోలా తెలిపారు.