సీఎం జగన్‌ తో మాట్లాడండి..షర్మిలకు హోంగార్డులు స్పెషల్ రిక్వెస్ట్

Yellow media fake news on Sharmila, YS Jagan

ఏపీలో జగన్ దూకుడు మీద ఉన్నారు. వరుసగా సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు చేరువైపోతున్నారు. దీంతో జగన్ పాలనపై అటు ప్రజలు కూడా సంతృప్తిగానే ఉన్నారు. ఇదే సమయంలో ఆయన సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న విషయం మనకు తెలిసిందే .

Yellow media fake news on Sharmila, YS Jagan

ఈ క్రమంలో షర్మిల రాజకీయ నేతలతో, విద్యార్థులతో వివిధ వర్గాల ప్రజలతో సమావేశం అవుతున్నారు. ఇదే నేపథ్యంలో తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్ర ప్రాంత హోంగార్డులు మంగళవారం లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిశారు. తమను తెలంగాణ నుంచి ఏపీలో విధుల్లోకి తీసుకునే విధంగా జగన్ ప్రభుత్వంతో మాట్లాడాలంటూ షర్మిలకు విన్నవించారు. తెలంగాణలో పని చేస్తున్నా ఇప్పటికీ తమను స్థానికేతరులుగానే గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా తమకు ఆప్షన్లు ఇవ్వలేదని హోంగార్డులు వాపోయారు. అందువల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని షర్మిల వద్ద హోంగార్డులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇక్కడ స్థానికేతరులుగా ఉండలేమని, తమను ఆంధ్రాలో విధుల్లోకి తీసుకునేలా సీఎం జగన్‌తో మాట్లాడాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు. హోంగార్డుల విన్నపంపై షర్మిల సానుకూలంగా స్పందించారు. హోంగార్డుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ విషయమై మరి షర్మిల జగన్‌తో చర్చిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.