Crime News: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన టెక్నాలజీని చాలా మంది మంచి విషయాల కొరకు ఉపయోగిస్తుంటే మరికొందరు మాత్రం ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా షాపింగ్ మాల్స్,లోకల్ టాయిలెట్ లలో చిన్న చిన్న కెమెరాలు అమర్చి వీడియో తీసి మహిళలు బెదిరిస్తున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. మహిళ స్నానం చేస్తుండగా నగ్న వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి మహిళలు బెదిరించిన ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కు చెందిన సాయి కృష్ణ ఇటీవల తన బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుండటంతో శుభకార్యానికి హాజరయ్యాడు. అక్కడ బంధువుల్లో ఒక మహిళ స్నానం చేస్తూ ఉండటం గమనించిన సాయి కృష్ణ తన సెల్ ఫోన్ ద్వారా వీడియో తీశాడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని సాయికృష్ణ సదరు మహిళలు బెదిరించాలని పన్నాగం వేశాడు.
ఈ తరుణంలో మహిళ నగ్నంగా స్నానం చేస్తున్న వీడియో లు సదరు మహిళ ఫోన్ కు వాట్సప్ ద్వారా షేర్ చేశాడు. ఆ వీడియో చూస్తున్న మహిళ వెంటనే ఫోన్ చేయగా తనతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని లేకుంటే.. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అందరికీ పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.దీంతో సదరు మహిళ సైబర్ క్రైం పోలీసులను సాయం కోసం ఆశ్రయించి జరిగిన విషయం మొత్తం చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేసి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతన్ని రిమాండ్ కు తరలించారు.