AP: నాడు జేసీ ఇంట్లో తిష్ట.. నేడు సొంత ఇంటికి రాలేని పరిస్థితిలో పెద్ద రడ్డి.. కర్మఫలమేనా?

AP : ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా హాట్ హాట్ గా కొనసాగుతూనే ఉంటాయి. రాయలసీమ జిల్లా అయిన అనంతపురం తాడిపత్రి రాజకీయాలు మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. తాడిపత్రిలో నిత్యం జెసి వర్సెస్ పెద్దారెడ్డి అనే విధంగా రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాడిపత్రి మొత్తం జేసీచేతులలోనే ఉందని చెప్పాలి. జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అలాగే ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో తాడిపత్రిలో వీరు చెప్పిందే శాసనం అనే విధంగా మారిపోయింది.

ఇకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రం తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వకుండా చేశారు. పెద్దారెడ్డి గత 13 నెలల నుంచి ఇప్పటివరకు తాడిపత్రిలో అడుగు పెట్టలేదు. ఈయన తాడిపత్రిలోకి వెళ్తే పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతోనే లా అండ్ ఆర్డర్ ప్రకారం పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టకూడదంటూ ఆంక్షలు ఉన్నాయి. అయితే ఇటీవల పెద్దారెడ్డి మొదటిసారి తాడిపత్రిలో తన నివాసానికి వెళ్లారు అయితే ఈయన వెళ్లిన కొన్ని నిమిషాలకే పోలీసులు వచ్చి తనని బలవంతంగా అరెస్టు చేసి అనంతపురం తరలించారు.

ఇలా సంవత్సరం పైగా తన సొంత ఇంట్లోకి అడుగుపెట్టలేక పోవటానికి కారణం గతంలో ఆయన చేసిన చర్యలేనని చెప్పాలి. గత ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డి ఏకంగా తన అనుచరులతో కలిసి జేసి ఇంట్లోకి వెళ్లి పెద్ద ఎత్తున హంగామా చేశారు జెసి వర్గీయులు తన పట్ల దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతో ఈయన స్వయంగా తన ఇంటికే వెళ్లి వార్నింగులు ఇచ్చారు. ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. ఆరోజు జెసి ఇంట్లోకి పెద్దారెడ్డి అడుగుపెట్టడంతోనే నేడు పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వకుండా జేసీ రివేంజ్ తీర్చుకున్నారని చెప్పాలి.