సిడ్నీ టెస్ట్ : 338కి ఆస్ట్రేలియా ఆలౌట్ … 4 వికెట్ల తో రాణించిన జడేజా !

సిడ్నీ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 338 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 166/2 తో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజూ అంత‌గా రాణించ‌లేక‌పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లో స్టీవ్ స్మిత్ 131, ల‌బుషేన్ 91, ప‌కోష్కీ 62 ప‌రుగులు చేశారు. రవింద్ర జడేజా తన స్పీన్ మాయజాలంతో నాలుగు వికెట్లు సాధించాడు.

అడిలైడ్‌, మెల్‌బోర్న్‌లో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ (131) మూడో టెస్ట్‌లో మాత్రం సెంచరీతో సూపర్ బ్యాటింగ్ ఆడాడు. రెండో రోజు ఆట ఆరగంట ముందుగానే ప్రారంభమైంది. ఆరంభంలోనే సెంచరీ వైపు కదులుతున్న లబుషేన్‌ (91)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. దీంతో ఓ చక్కటి భాగాస్వామ్యానికి తెరపడింది.

100 పరుగుల భాగస్వామ్యం తో భారత్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిని స్మిత్‌, లబుషేన్ ‌లను రవీంద్ర జడేజా వీడదిశాడు. ఆ తర్వాత వాడే కూడా స్వల్ఫ స్కోర్‌కే వెనుదిరిగాడు. జడేజా మరో వికెట్ సాధించాడు. ఆ తర్వాత లంచ్ వెళ్ళే ముందు కామెరాన్‌ గ్రీన్ ‌ను బుమ్రా పెవిలియన్‌ చేర్చాడు. టీమిండియా బౌల‌ర్ల‌లో జ‌డేజాకు 4, బుమ్రా, అశ్విన్ ల‌కు రెండేసి వికెట్లు, సిరాజ్ కు ఒక వికెట్ ద‌క్కింది.