మన దేశంలో కులం, మతం పేర్లతో ఏపనైన చేయవచ్చు. కులం పేరుతో ఫ్రెండ్షిప్ చేయవచ్చు, మతం పేరుతో వాళ్ళను విడగొట్టవచ్చు.కులం పేరుతో సంబంధం లేని వ్యక్తిని ఎదో కేసులో ఇరికించవచ్చు, మతం పేరుతో ఈ కేసులో నుండైనా ఎవరినైనా విడిపించవచ్చు.
మన దేశ రాజకీయాలు ప్రజాసేవ అనే నినాదంతో నడవడం లేదు. కులం, మతం అనే పేర్లతో నడుస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇవే రాజకీయాలు నడుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కొన్ని రోజుల క్రితం విజయవాడలో జరిగిన స్వర్ణా ప్యాలస్ ఘటనతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో పది మంది చనిపోయారు. దీనిపై ఇప్పుడు అధికారులు విచారణ చేస్తున్నారు.
ఈ విచారణలో కూడా అధికారులు కావాలనే ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేసి, సంబంధం లేకపోయినా నోటీసులు జారీ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విచారణ ఇప్పుడు గుంటూరులోని రాయపాటి సాంబశివ రావు కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా వారి ఇంట్లో ఆడవాళ్లందర్నీ ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితం గుంటూరు రమేష్ ఆస్పత్రి సీవోవోగా విధులు నిర్వహిస్తున్న రాయపాటి సాంబశివరావు కోడలు మమతను విజయవాడ పిలిపించి ఏడు గంటల పాటు ప్రశ్నించారు. తనకు కరోనా వచ్చిందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. రమేష్ హాస్పిటల్ లో వైద్యురాలుగా పని చేస్తున్న రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమార్తె అయిన రాయపాటి శైలజకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఈ ఘటనతో సంబంధం లేని వ్యక్తులను పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. గంటలకొద్దీ ప్రశ్నలు సందిస్తున్నారు. అమరావతి పోరాటంలో రైతుల తరపున మహిళా జేఏసీలో శైలజా కీలకంగా వ్యవహరిస్తుండటం వల్లే ఇలా విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అగ్నిప్రమాదానికి వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధం ఏంటని డాక్టర్ల అసోసియేషన్ అడుగుతున్నప్పటికి ఏపీ పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ విచారణలో ఏపీ పోలీసులు ఎవర్ని దోషులుగా తెలుస్తారో వేచి చూడాలి.